News
News
X

Hyderabad IT Raids: 50 బృందాలతో హైదరాబాద్ లో ఐటీ దాడులు - ఐటీ రిటర్న్స్ లో అవకతవకలే కారణం!

Hyderabad IT Raids: హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగుతున్నాయి. మొత్తం 50 బృందాలతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలులో అవకతవకలే ఇందుకు కారణం అని తెలుస్తోంది. 

FOLLOW US: 
Share:

Hyderabad IT Raids: హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరుగుతున్నాయి. ప్రముఖ స్థిరాస్తి రంగ సంస్థల కార్యాలయాలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 50 బృందాలో స్థరాస్తి రంగ సంస్థ డైరెక్టర్లు, సీఈఓల కార్యాలయాలు, ప్రతినిధుల ఇళ్లు, ప్రధాన సంస్థ అనుబంధ సంస్థల కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. కేపీహెచ్ బీలోని లోధా అపార్ట్ మెంట్స్ లోని ఊర్జితా కన్ స్ట్రక్షన్ ఎండీ శ్రీనివాస రెడ్డి, శ్రీ ఆదిత్య హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ కోటారెడ్డి, అతని కుమారుడు ఆదిత్య రెడ్డి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. అదే విధంగా ప్రముఖ బిల్డర్ మాధవరెడ్డి , జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, పంజాగు్టలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఐటీ రిటర్న్స్ దాఖలులో అవకతవకలు జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. గడిచిన ఐదేళ్లలో ఐటీ రిటర్న్స్ వివరాలను అకౌంట్స్ విభాగం నుంచి తీసుకున్న ఐటీశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 

ఐటీ దాడుల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..

పన్ను భారీగా ఎగవేసిన అనేక వ్యాపారవేత్తలతో పాటు హైదరాబాద్ లోని పలు ఐటీ కంపెనీలు, షాపింగ్ మాల్ యజమానులు తదితరులపై దాడు చేసి అనేక కీలక డాక్యుమెంట్లతో పాటు పలు హార్ట్ డిస్క్ లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనేక దాడుల్లో ఆయా సంస్థలకు సంబంధించిన నిధులు వేరే కంపెనీలకు దారి మళ్లినట్లు గుర్తించారు. ఇటీవలే ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఐటీ దాడులు కొనసాగించిన విషయం తెలిసిందే. మొత్తం 50 బృందాలు 40 కార్లలో, మూడు సీఆర్పీఎఫ్ బస్సుల్లో ఐటీ సిబ్బంది దాడులు చేశారు. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సంబంధించిన గచ్చిబౌలి ప్రధాన కార్యాలయంతో పాటు దేశ వ్యాప్తంగా 18 చోట్ల ఎక కాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. 

ఇదిలా ఉండగా.. మొన్నటికి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగాయని  ఐటీ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. అనధికారికంగా లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, మల్లారెడ్డి-నారాయణ ఆసుపత్రి కోసం వెచ్చించినట్టు అధికారులు గుర్తించారు.  

65 బృందాలు సోదాలు 

రెండు రోజులుగా జరుగుతున్న సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది  65 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేశారు.  కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల రాత్రికి ముగిసే అవకాశముందని, ఇంకొన్ని చోట్ల రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్టు.. ఆధారాలు సేకరించామని ఐటీ అధికారులు పేర్కొన్నారు. మల్లారెడ్డి వియ్యంకుడు వర్ధమాన కళాశాలలో డైరెక్టర్‌గా ఉండటంతో అక్కడ కూడా సోదాలు చేసినట్టు తెలుస్తోంది. 

Published at : 18 Jan 2023 05:09 PM (IST) Tags: Hyderabad News Telangana News Hyderabad IT Raids: IT Raids in Telugu States Latest Telangana News

సంబంధిత కథనాలు

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ

TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ

Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్

Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి

IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌‌గా భారతి హోళికేరి

తెలంగాణ నుంచి తరిమేయండి- ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ నుంచి తరిమేయండి- ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!

Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Adani Enterprises, Sun Pharma

Stocks to watch 01 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Adani Enterprises, Sun Pharma

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని