News
News
X

Professor Raviranjan Suspended: హెచ్‌సీయూ ప్రొఫెసర్ రవిరంజన్ సస్పెండ్, విద్యార్థులకు తెలిపిన రిజిస్ట్రార్!

Professor Raviranjan Suspended: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవిరంజన్ ను సస్పెండ్ చేసినట్లు రిజిస్ట్రార్ బి.జె రావు తెలిపారు. ఇదే విషయాన్ని ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులకు చెప్పారు.

FOLLOW US: 
Share:

Professor Raviranjan Suspended: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయ్ లాండ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసిన ప్రొఫెసర్ రవి రంజన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ జి.జె రావు తెలిపారు. అలాగే ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి తెలిపారు.  అయితే అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. బాధితురాలికి న్యాయం చేస్తామని.. వెంటనే ఆందోళనను విరమించాలని రిజిస్ట్రార్ వారిని కోరారు. అయితే రిజిష్టర్ బి.జె రావు తీసుకున్న నిర్ణయంపై లిఖిత పూర్వకంగా కాపీ చూపించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన రిజిస్ట్రార్ హెచ్సీయూ జారీ చేసిన ఉత్తర్వులను విద్యార్థులకు చూపించారు. ప్రొఫెసర్ రవి రంజన్ సస్పెండ్ నిజమేనని తెలుసుకున్న విద్యార్థులు ఆందోళనను విరమించారు.  


అసలేం జరిగిందంటే..?

విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పాల్సిన ఆచార్యులే విద్యార్థులపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఓ ప్రొఫెసర్ నీచానికి ఒడిగట్టాడు. థాయిలాండ్ నుంచి ఉన్నత చదువుల కోసం సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థినిపై గత రాత్రి హిందీ బోధించే ప్రొఫెసర్ రవిరంజన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాత్రి 8 గంటలకు క్యాంపస్ నుంచి బయటికి వచ్చిన బాధిత విద్యార్థినిని.. హిందీ బేసిక్స్ నేర్పిస్తానంటూ తన కారులో ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఇంట్లో బాధిత యువతకి మద్యం తాగించాడు. అనంతరం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత యువతి వద్దని వారిస్తున్నా వినకుండా ఆమెపై చేతులు వేయడం, ముద్దుపెట్టుకోబోవడం వంటివి చేశాడు. దీంతో ఆమె ప్రతిఘటించడంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. అనంతరం యువతిని స్వయంగా కారులో తీసుకువచ్చి సెంట్రల్ యూనివర్సిటీ గేటు దగ్గర వదిలిపెట్టి వెళ్లినట్లు సమాచారం. 

ఇప్పటికే ఆ ప్రొఫెసర్ పై మూడు కేసులు ఉన్నట్లు సమాచారం..

అక్కడి నుండి బాధితురాలు నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తనపై అత్యాచార యత్నం చేయబోయిన ప్రొఫెసర్ రవిరంజన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ప్రొఫెసర్ రవి రంజన్ పై మూడు కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో నమోదైన కేసులపై చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకుని ఉండేది కాదంటున్నారు విద్యార్థులు. 

బాధితురాలు థాయిలాండ్ ఎంబసీ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో ఇంటర్నేషనల్ వ్యాప్తంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. యూనివర్సిటీలో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేస్తుందని తెలుస్తోంది. అయితే గత నెల రోజుల క్రితం ఉమెన్ ఎంపవర్మెంట్ పై ప్రొఫెసర్ రవి రంజన్ ఉపన్యాసం ఇవ్వడం విశేషం. మహిళా సాధికారత మీద ఉపన్యాసాలు ఇస్తూ విద్యార్థినిల మీద లైంగిక దాడికి పాల్పడడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

విద్యార్థుల ఆందోళన..

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థాయిలాండ్ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. హెచ్ సీయూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించి ప్రొఫెసర్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.

Published at : 03 Dec 2022 06:12 PM (IST) Tags: Hyderabad crime news Hyderabad News Telangana News Hyderabad Central University HCU Registrar GJ Rao

సంబంధిత కథనాలు

Telangana Budget 2023: రూ.3 వేల నిరుద్యోగ భృతిపై బడ్జెట్ లో ఎందుకు ప్రస్తావించలేదు?: ఎంపీ సోయం బాపూరావు

Telangana Budget 2023: రూ.3 వేల నిరుద్యోగ భృతిపై బడ్జెట్ లో ఎందుకు ప్రస్తావించలేదు?: ఎంపీ సోయం బాపూరావు

Telangana Budget 2023: రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు 2 శాతం నిధులేనా?: బడ్జెట్ పై బండి సంజయ్

Telangana Budget 2023: రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు 2 శాతం నిధులేనా?: బడ్జెట్ పై బండి సంజయ్

SIT To Supreme Court : సుప్రీంకోర్టుకు వెళ్లనున్న సిట్ - ఎమ్మెల్యేలకు ఎర కేసు ఏ మలుపులు తిరగబోతోంది ?

SIT To Supreme Court :  సుప్రీంకోర్టుకు వెళ్లనున్న సిట్ - ఎమ్మెల్యేలకు ఎర కేసు ఏ మలుపులు తిరగబోతోంది ?

Ponguleti Srinivas Reddy : మీకు ఖలేజా ఉంటే నన్ను సస్పెండ్ చేయండి, బీఆర్ఎస్ అధిష్ఠానానికి పొంగులేటి సవాల్

Ponguleti Srinivas Reddy : మీకు ఖలేజా ఉంటే నన్ను సస్పెండ్ చేయండి, బీఆర్ఎస్ అధిష్ఠానానికి పొంగులేటి సవాల్

BRS Mlas Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం - ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

BRS Mlas Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం - ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!

Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!