అన్వేషించండి

Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు

షాబాద్ ఆరుగురి హత్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడాన్ని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తప్పుబట్టారు. కన్నెపల్లి నుంచి పంప్ హౌస్ ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలన్న సోయి కూడా లేదంటూ మండిపడ్డారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మేడిగడ్డ గేట్లు తెరచినా కన్నెపల్లి నీళ్లు ఎత్తిపోవచ్చని హరీష్‌రావు.
  • సీఎం రేవంత్‌రెడ్డిది సైకో తరహా ప్రవర్తన, హిట్లర్ భాష అన్నారు.
  • షాబాద్ హంతకుడితో పోల్చి, సీఎం స్పందనపై హరీష్‌రావు విమర్శలు.

Harish Rao vs Revanth Reddy |హైదరాబాద్: ఇరిగేషన్ శాఖపై కనీస అవగాహనా లేని సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడి నవ్వులపాలు అయ్యారని బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చునని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పినా సీఎంకు సోయి రాలేదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డితో ఎవరూ పోటీ పడలేరని, ఆయన మాటలు వింటుంటే ఒక సైకో తరహా ప్రవర్తన కనిపిస్తోందని విమర్శించారు. 

రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పినా సీఎంకు సోయి రాలేదు..
ఇరిగేషన్ అంశాలపై ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేదని హరీష్ రావు పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లను ఆన్ చేయవచ్చనే కనీస సోయి రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిన తర్వాత కూడా సీఎంకు రాలేదన్నారు. ఉన్న వాస్తవాలు బయటపెడితే రిటైర్డ్ ఇంజనీర్లను జైల్లో వేస్తానని సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం బయటపడుతుందనే భయంతోనే నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. నాడు కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి, దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారే తప్ప ఎన్నడూ రక్తం పారించే ప్రయత్నం చేయలేదని గుర్తుచేశారు. కానీ నేడు రేవంత్ రెడ్డి మాత్రం రైతుల పక్షాన నిలబడి నీళ్లు అడిగిన వారిని కోస్తా, రక్తం పారిస్తా అనడం దారుణమని, ఇదే కేసీఆర్‌కు రేవంత్ రెడ్డికి ఉన్న తేడా అని హరీష్ రావు హితవు పలికారు.

పొలాల్లో నీళ్లు పారించమంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులు పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హిట్లర్ తనకు ఆదర్శమని చెప్పుకున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు హిట్లర్ తరహాలోనే హింసను ప్రేరేపించే హంతక భాష మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఓటమి భయంతో, తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నందువల్లే సీఎం ఇలాంటి బూతు భాషను అందుకుంటున్నారని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. 

Also Read: POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు

షాబాద్ హత్యల ఉన్మాదికి, రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదు..
షాబాద్‌లో ఆరుగురిని గొంతు కోసి కిరాతకంగా చంపిన ఉన్మాది రాజ్‌కుమార్‌కు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాకు దక్కనిది ఎవరికీ దక్కొద్దు’ అనే ఉన్మాదంతో ఆ హంతకుడు ఆరుగురిని కోడిని కోసినట్లు కోసి దారుణంగా చంపేశాడని, ఆ ఇంట్లో ఇప్పుడు మాటలు రాని, నడవలేని ఒక దివ్యాంగ అమ్మాయి మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి ఘోర ఉదంతం జరిగితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కి కనీసం స్పందించే తీరిక లేకపోయిందని విమర్శించారు. అంతేకాకుండా, నిన్న అంత పెద్ద ఉన్మాదకాండ జరిగితే, రాష్ట్రానికి చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారి హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో గోల్ఫ్ ఆడుతూ టైమ్ పాస్ చేశారని, దీన్ని బట్టే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

మేడిగడ్డ - కన్నెపల్లి పంప్ హౌస్ వివాదం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బారేజ్ గేట్ల వ్యవహారంపై గత కొంతకాలంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర యుద్ధం నడుస్తోంది. మేడిగడ్డ బారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో, అక్కడ నీటిని నిల్వ చేయకుండా గేట్లను తెరిచి ఉంచారు. అయితే, గేట్లు తెరిచి ఉన్నా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయవచ్చని బీఆర్ఎస్ నేతలు, కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు సూచిస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికి భిన్నంగా వాదిస్తోంది. మోటర్లు ఆన్ చేస్తే గతంలో తాము చేసిన ఆరోపణలు అబద్ధమవుతాయనే ఉద్దేశ్యంతోనే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీరు ఇవ్వకుండా అడ్డుపడుతోందని హరీష్ రావు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు కేసీఆర్ చేసిన 11 రోజుల ఆమరణ నిరాహార దీక్షను హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదని, కానీ ఎన్నడూ హింసను ప్రోత్సహించలేదని అన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనను ప్రశ్నించిన వారిని, రైతులను ఉద్దేశించి "కోస్తా, రక్తం పారిస్తా" అంటూ మాట్లాడటం సరైన పద్ధతి కాదని హరీష్ రావు హితవు పలికారు.



Frequently Asked Questions

ఇరిగేషన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేసిన ప్రధాన విమర్శ ఏమిటి?

సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ శాఖపై కనీస అవగాహన లేదని హరీష్ రావు విమర్శించారు. ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడి నవ్వులపాలు అవుతున్నారని పేర్కొన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ గేట్లు తెరిచి ఉన్నా నీళ్లు ఎత్తిపోయవచ్చని ఎవరు సూచించారు?

మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చునని రిటైర్డ్ ఇంజినీర్లు ముఖ్యమంత్రికి సూచించారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి వారి సూచనను పట్టించుకోలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

రిటైర్డ్ ఇంజనీర్లను సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని హరీష్ రావు ఎందుకు ఆరోపించారు?

వాస్తవాలు బయటపెడితే జైల్లో వేస్తానని సీఎం రేవంత్ రెడ్డి రిటైర్డ్ ఇంజినీర్లను బెదిరిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ దుష్ప్రచారం బయటపడుతుందనే భయంతోనే నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు.

రైతులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఎలా స్పందించారు?

రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Hyderabad Traffic Diversions: ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget