Naveen Murder Case: నవీన్ హత్య కేసుతో అమ్మాయికి ఏ సంబంధం లేదు: రాచకొండ సీపీ క్లారిటీ
Rachakonda CP on Naveen Murder Case విద్యార్థి నవీన్ హత్య కేసులో ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని రాచకొండ సీపీ స్పష్టం చేశారు. నవీన్ హత్య విషయంపై యువతి పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.
Rachakonda CP DS Chauhan on Naveen Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీటెక్ స్టూడెంట్ నవీన్ దారుణహత్యపై రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ కీలక విషయాలు వెల్లడించారు. విద్యార్థి నవీన్ హత్య కేసులో ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని రాచకొండ సీపీ స్పష్టం చేశారు. నవీన్ హత్య విషయంపై యువతి పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. గతంలోనూ తాను ఇదే మాట చెప్పానని, విచారణలో సైతం ఇదే తేలిందన్నారు. వాట్సాప్ చాటింగ్ లో సైతం నవీన్ హత్యకు సంబంధించి యువతికి విషయాలు తెలుసునని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆమె ఇంకా ఏ బాధలో ఉందో, దుష్ప్రచారంతో ఆమె మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందన్నారు.
పోలీసులు శనివారం మరోసారి ఘటనా స్థలానికి నిందితుడు హరిహర కృష్ణను తీసుకెళ్లి సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఓ సీనియర్ అధికారిని నియమించి కేసు దర్యాప్తు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితుడు హరిహర కృష్ణకు సహకరించిన అందరిపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. నిందితుడి నుంచి ఇంకా చాలా విషయాలు రాబట్టాల్సి ఉందన్నారు. మనుషులెవరూ ఇంత దారుణమైన పరి చేయరని, అయితే పూర్తి దర్యాప్తు జరగకుండా పోలీసులు సగం సగం వివరాలు ప్రచారం వెల్లడించేది లేదన్నారు. ఇప్పుడు వెల్లడించిన వివరాలు కేసు దర్యాప్తు పూర్తయ్యాక మారిపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయన్నారు.
విక్రమ్ సినిమాలో మర్డర్ సీన్ చూసి ఇన్ స్పైర్ అయిన హరి హరకృష్ణ
ఇటీవల విక్రమ్ అనే సినిమా చూసిన హరిహర కృష్ణ అందులో చూపించిన హత్యల్ని చూసి బాగా ఇన్ స్పయిర్ అయినట్లుగా గుర్తించారు. విక్రమ్ సిమిమా చూసి హత్య చేసి నట్టు పోలీసులకి వెల్లడించాడు హరి హర కృష్ణ . విక్రమ్ సినిమాలో సీన్లలో ఒక మనిషిని చంపి తలని శరీర భాగలని తొలగించిన సీన్ గురించి వివరించాడు. సాక్ష్యాలు లేకుండా చేయడానికి శరీర భాగాలను సంచిలో వేసికోని వెళ్లి..ప్లాన్ ప్రకారం తగుల పెట్టినట్లుగా హరకృష్ణ పోలీసులకు వివరించారు. నవీన్ హత్య కేసులో హరిహర కృష్ట స్నేహితులు సహాయం తీసుకున్నట్టు వెల్లడయినట్లుగా తెలుస్తోంది. హత్యకు ముందు హత్యకు తర్వాత ఎక్కువ సార్లు ఫోన్స్ చేసి మాట్లాడాడు. కాల్ రికార్డ్స్ ..వాట్సాప్ ఆధారం గా స్నేహితుల లిస్ట్ తయారు చేశారు పోలీసులు.
గెట్ టుగెదర్ అని పిలిచి మర్డర్
ఫిబ్రవరి 17న నవీన్‌ను గెట్ టుగెదర్ పేరుతో పిలిచిన హరిహరకృష్ణ ఆ రోజు రాత్రి వరకూ నవీన్ ఉండేలా ప్లాన్ వేశాడు. సాయంత్రం దాటేవరకు నవీన్ ను ఎల్బీనగర్, ఇతర ప్రాంతాల్లో తిప్పాడు. తిరిగి వెళ్లిపోతానని నవీన్ చెప్పడంతో నల్గొండలో దింపుతానని బైక్‌పై ఎక్కించుకున్నాడు హరిహరకృష్ణ. హయత్ నగర్ దాటాక మద్యం తీసుకుని, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ముందే ప్లాన్ చేసుకున్న ప్రాంతానికి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా మర్డర్ చేశాడు. ఈ హత్యలో హరిహరకృష్ణ దుస్తులకు రక్తం అంటుకుంది. అలాగే బయటకెళ్తే అనుమానం వస్తుందని హత్య చేసిన స్థలంలోనే మరుసటి రోజు తెల్లవారుజాము 3 గంటల వరకు ఉన్నాడు. రక్తంతో తడిసిన బట్టలు అక్కడికి సమీపంలోనే విసిరేసి తన వెంట తెచ్చుకున్న కొత్త దుస్తుల్ని వేసుకున్నాడు.
అనంతరం నగరంలోని ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లి అక్కడ స్నానం చేశాడు. అక్కడి నుంచి బయల్దేరి వరంగల్‌లోని తండ్రి ప్రభాకర్ వద్దకు వెళ్లాడు. అప్పటికే నవీన్ కనిపించడం లేదని స్నేహితుల నుంచి హరిహరకృష్ణకు ఫోన్లు రావడంతో ఏం జరిగిందని హరిహరకృష్ణను తండ్రి ప్రశ్నించాడు. అక్కడే ఉంటే తండ్రికి అనుమానం వస్తుందని భావించి 19వ తేదీన పని ఉందంటూ హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వేరే చోటికి వెళ్లాడు.