KCR Birthday Wishes: కేసీఆర్ చిరకాలం జీవించాలి, సీఎంకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్, కేటీఆర్ ఎలా చెప్పారో తెలుసా
68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా కేసీఆర్‌కు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అనంతరం మోదీ కేసీఆర్‌కు ఫోన్ చేసి కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Birthday wishes to Telangana CM Shri KCR Garu. Praying for his long and healthy life. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2022
‘‘పెద్ద పెద్ద కలలు కనే వ్యక్తికి, అసాధ్యాన్ని సాధ్యమయ్యే కళగా మార్చుకున్న వ్యక్తికి, దయతో నిండిన హృదయంతో అందర్నీ నడిపించే వ్యక్తికి, ధైర్యాన్ని నిర్వచించే, గడ్డు పరిస్థితులను సవాలు చేసే వ్యక్తికి, నా నాయకుడు, నా తండ్రి అని నేను గర్వంగా పిలుచుకునే వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు సుదీర్ఘకాలం జీవించాలి.’’ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
To a man, who can only dream Big, who has made impossible an art of the possible, One who leads with a heart full of compassion, One who defines courage & challenges status quo
— KTR (@KTRTRS) February 17, 2022
A man who I proudly call my leader & my father. May you live long & stay blessed🙏#HappyBirthdayKCR pic.twitter.com/H5qHGit0Ra
‘‘తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సదా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (@TelanganaCMO) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సదా ఆనంద ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) February 17, 2022
రక్తదానం చేసిన మంత్రి హరీశ్ రావు
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని మంత్రి హరీశ్ రావు రక్త దానం చేశారు. నారాయణఖేడ్‌లోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రజలకు న్యాయం చేసే మంచి నాయకుడని, ఆయన నాయకత్వాన్ని తాము కూడా పుణికిపుచ్చుకుంటామని ట్వీట్ చేశారు. తాను రక్తదానం చేస్తున్న ఫోటోలను కూడా జత చేశారు.
On the birthday eve of Hon'ble #CMKCR Garu, I have donated blood at Narayankhed Area Hospital.
— Harish Rao Thanneeru (@trsharish) February 16, 2022
CM KCR Garu is a leader who has served and continues to serve the people, we follow his able leadership for serving mankind.#HappyBirthdayKCR pic.twitter.com/Uv5L3rIFzD
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పాల్గొన్నారు.
Took part in the blood donation camp organised at Telangana Bhavan as part of Hon’ble CM Sri KCR Garu birthday celebrations along with Colleague Minister Mahmood Ali Garu & Other Dignitaries. #HappyBirthdayKCR pic.twitter.com/2DqeNgwSE2
— Talasani Srinivas Yadav (@YadavTalasani) February 16, 2022
Took part in the blood donation camp organised at Telangana Bhavan as part of Hon’ble CM Sri KCR Garu birthday celebrations along with Colleague Minister Talasani Srinivas Yadav Garu, MLAs, MLCs & Other Dignitaries. #HappyBirthdayKCR pic.twitter.com/Dj2lkxuUWt
— Mohammed Mahmood Ali (@mahmoodalitrs) February 16, 2022