అన్వేషించండి

Hyderabad News : పచ్చదనంలో పోటీ లేని హైదరాబాద్ - దేశంలో మరో సిటీ సాధంచలేని అవార్డు సొంతం !

గ్రీన్ సిటీ అవార్డు హైదరాబాద్‌ను వరించింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ పచ్చదనాన్ని పెంచినందుకు ఈ పురస్కారం వచ్చింది.


Hyderabad News :  హైదరాబాద్‌కు మరో అరుదైన ఘనత లభించింది. ప్రపంచ హరిత నగరాల అవార్డులు 2022లో హైదరాబాద్‌కు కీలక అవార్డు లభించింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ హరిత హారాన్ని ఏర్పాటు చేసినందున..పురస్కారం లభించింది. లివింగ్ గ్రీన్ కేటగిరీ కింద ఈ అవార్డు వచ్చింది. కొరియాలో  ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఇండియా నుంచి ఈ పురస్కారం అందుకున్న ఒకే ఒక్క నగరం హైదరాబాద్ అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం వల్లనే ఇది సాధ్యమయిందని ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ప్రకటించారు. 


Hyderabad News : పచ్చదనంలో పోటీ లేని హైదరాబాద్  -  దేశంలో మరో సిటీ సాధంచలేని అవార్డు సొంతం !

హైదరాబాద్‌కు గ్రీన్ అవార్డులు రావడం ఇదే మొదటి సారి కాదు. గత రెండేళ్లుగా ట్రీ సిటీ పురస్కారాలను హైదరాబాద్ అందుకుంటోంది.  గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లు, ఎవెన్యూ ప్లాంటేషన్‌ వివరాలతోపాటు పలు కార్యాలయాలు, విశ్వ విద్యాలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో చేపట్టిన హరితహారం కారణంగా ‘ట్రీ సిటీ ఆఫ్‌ ది వరల్డ్‌-2021’గా ప్రకటిస్తున్నట్టు ఎఫ్‌ఏవో, అర్బన్‌ డే ఫౌండేషన్‌ గతంలో వెల్లడించాయి. అర్బన్‌, కమ్యూనిటీ ఫారెస్ట్రీలో హైదరాబాద్‌ ప్రపంచంలోని పలు నగరాలకు ఆదర్శంగా నిలిచిందని ప్రతినిధులు ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం, మినీ అడవుల ఏర్పాటుతో హైదరాబాద్‌ను అత్యంత ఆరోగ్యకరమైన, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దారని అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి.
Hyderabad News : పచ్చదనంలో పోటీ లేని హైదరాబాద్  -  దేశంలో మరో సిటీ సాధంచలేని అవార్డు సొంతం !

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కొన్నేళ్లుగా కోట్లాది మొక్కలను జిహెచ్‌ఎంసితో పాటు ఇతర శాఖలు నాటడంతో పాటు వాటి మనుగడకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. హరిత భవిష్యత్ కు గాను మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకై ఐదు ప్రధాన లక్ష్యాలను మున్సిపల్ శాఖ చేపట్టింది. మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించడం, మొక్కల నిర్వహణకు ప్రత్యేక నిబంధనల ఏర్పాటు, మొక్కల ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రత్యేక నిధుల కేటాయింపు, చెట్ల పెంపకంపై చైతన్యం పెంచే ఉత్సవాల నిర్వహణ అనే లక్ష్యాలతో నగరంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్, కార్యాలయాలు, విశ్వవిద్యలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం ప్లాంటేషన్ ప్రజలకు ఆహ్లాదం పంచుతోంది.  మెరుగైన జీవనాన్ని అందిస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ అవార్డులు నగరానికి వస్తున్నాయి.
Hyderabad News : పచ్చదనంలో పోటీ లేని హైదరాబాద్  -  దేశంలో మరో సిటీ సాధంచలేని అవార్డు సొంతం !

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Pawan Kalyan Comments On Tirumala Stampede: టీటీడీ ఛైర్మన్ గారూ మేల్కొండి- వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టండి: పవన్
టీటీడీ ఛైర్మన్ గారూ మేల్కొండి- వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టండి: పవన్
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు, ఫీజు చెల్లింపుకు చివరితేది ఎప్పుడంటే?
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు, ఫీజు చెల్లింపుకు చివరితేది ఎప్పుడంటే?
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Embed widget