News
News
X

PM Modi Tour: ప్రధాని పర్యటన సందర్భంగా సోషల్ మీడియాలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ బలప్రదర్శన

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధానికి ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ ఎక్కడ అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఈ హ్యాష్ ట్యాగ్‌ టాప్‌లో ట్రెండ్‌ అయింది.

FOLLOW US: 

హైదరాబాద్‌లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై సామాజిక మాధ్యమాల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో వార్ నడుస్తోంది. #ShameOnYouKCR, #EqualityForTelangana పేరుతో దుమ్మెత్తి పోసుకుంటున్నారు. 

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానిని ఈక్వాలిటీ ఫర్‌‌ తెలంగాణ అంటూ ట్యాగ్‌ చేస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు, మద్దతుదారులు. దీనికి పోటిగా షేమ్‌ ఆన్‌ యూ కేసిఆర్ అంటూ బీజేపీ నేతలు మద్దతుదారులు ప్రతిదాడి చేస్తున్నారు. వీళ్ల పాలిటిక్స్‌తో ఈ రెండు హాష్‌ట్యాగ్స్‌ ట్విట్టర్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి.   

ఈక్వాలిటీ ఫర్‌ తెలంగాణ అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది. తెలంగాణకు చెందిన నెటిజన్లు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని నిలదీస్తున్నారు. తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. వివిధ రంగాల్లో తెలంగాణపైన కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను తమ ట్విట్లతో ఎండగట్టారు. 

కేంద్ర ప్రభుత్వ నిధుల పంపిణీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అందని సహాయం, పునర్విభజన చట్టం హామీలు, తెలంగాణకు దక్కని జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అనేక అంశాల పైన ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. తెలంగాణ మంత్రులు సైతం ప్రధాని పర్యటన సందర్భంగా ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ వివక్షను ప్రశ్నించారు.

కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ప్రశ్నించారు కొందరు నెటిజన్లు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపైన తమ ప్రభుత్వంతోపాటు మంత్రులు, కేంద్రానికి పంపిన లేఖలపైన ఇప్పటిదాకా స్పందించకపోవడం పట్ల ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. 

కేంద్రం తెలంగాణలోని వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగంపైన చూపిస్తున్న వివక్షను ఎత్తి చూపారు మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణలో ఘనంగా జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించకపోవడంపై మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. 
తనదైన శైలిలో అద్భుతమైన వివిధ కార్యక్రమాలతో పురోగమిస్తున్న తెలంగాణలాంటి అభివృద్ధి  చెందుతున్న రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ఆపుతుందని ఎంపీ రంజిత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

పలువురు యువకులు తమదైన శైలిలో ట్యాంకుబండు పైన తెలంగాణపైన కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టేలా వివిధ అంశాలతో భారీ ఫ్లెక్సీని ప్రదర్శించారు. సుమారు 20 వేలకుపైగా ట్వీట్లు ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ హాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యాయి.

మోదీ పర్యటన ఖరారు అయినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ నడుస్తోంది. ముఖ్యంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన రోజు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్‌ పెట్టి బీజేపీ, కేంద్రం తీరును తీవ్ర స్థాయిలో కడిగేశారు.

టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారానికి దీటుగా బీజేపీ కూడా ట్విట్టర్‌లో ప్రచారం చేసింది. షేమ్‌ ఆన్‌ యూ కేసీఆర్‌ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో టీఆర్‌ఎస్‌పై విరుచుకు పడ్డారు. 

కేంద్రం ఇస్తున్న నిధులను తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు బీజేపీ లీడర్లు. రాజా సింగ్ లాంటి వాళ్లు కేసీఆర్, టీఆర్‌ఎస్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడుతున్నారు. 

Published at : 05 Feb 2022 08:18 PM (IST) Tags: PM Modi Twitter Trending Statue Of Equality Modi Hyderabad tour Equality For Telangana

సంబంధిత కథనాలు

Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!

తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!

అనూప్, కళ్యాణ్ మాలిక్, మిక్కీ జే మేయర్‌కు సంగీత దర్శకుడు థమన్ ఛాలెంజ్‌!

అనూప్, కళ్యాణ్ మాలిక్, మిక్కీ జే మేయర్‌కు సంగీత దర్శకుడు థమన్ ఛాలెంజ్‌!

Nature Index Rank: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే నెంబర్ వన్ - నేచర్ ఇండెక్స్ ర్యాంకులో టాప్

Nature Index Rank: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే నెంబర్ వన్ - నేచర్ ఇండెక్స్ ర్యాంకులో టాప్

Mlc Kavita : పెద్దలకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ, పేదలకు మాత్రం పింఛన్ ఇవ్వకూడదా? - ఎమ్మెల్సీ కవిత

Mlc Kavita : పెద్దలకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ, పేదలకు మాత్రం పింఛన్ ఇవ్వకూడదా? - ఎమ్మెల్సీ కవిత

టాప్ స్టోరీస్

Liger Team At Mumbai : వాళ్ళిద్దరి బాండింగ్ అలాంటిది - ముంబైలో లవ్లీ 'లైగర్' జోడీ  

Liger Team At Mumbai : వాళ్ళిద్దరి బాండింగ్ అలాంటిది - ముంబైలో లవ్లీ 'లైగర్' జోడీ  

Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు

Harsha Kumar Son Case : యువతితో అసభ్య ప్రవర్తన, మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడిపై కేసు నమోదు

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి