అన్వేషించండి

Telangana Mass Killing News: రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో దారుణం- పోక్సో కేసు పెట్టారని ఆరుగురి హత్య- నిందితుడి ఘాతుకంతో వణికిపోయిన గ్రామం

Telangana Mass Killing News:రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. పోక్సో కేసులో అజ్ఞాతంలోకి వెళ్లి వచ్చిన ఒక నిందితుడు దైవాలగూడలో అర్థరాత్రి సైకోలా రెచ్చిపోయాడు. ఆరుగురిని హత్య చేశాడు. 

Telangana Mass Killing News:రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం దైవాలగూడలో దారుణం జరిగింది. తనపై ఫోక్సో కేసు పెట్టారన్న కసితో ఒక వ్యక్తి బెయిల్‌పై వచ్చి ఆరుగురిని హత్య చేశాడు. తనపై కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లి, తన కుటుంబంలోని వారిని అర్ధరాత్రి ఊచకోత కోశాడు.

మే 16 రాజ్‌కుమార్ అనే వ్యక్తి తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడని దైవాలగూడలో ఒక బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. దీనికి కుటుంబ సభ్యులు కూడా సాక్ష్యం చెప్పారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడికి ఈ మధ్య బెయిల్‌ వచ్చింది. బెయిల్ రావడంతో అజ్ఞాతంలో ఉన్న రాజ్‌కుమార్ ఇప్పుడు ఊరిలోకి వచ్చి వీరంగం సృష్టించాడు. వచ్చీరాగానే దైవాలగూడలో చేరుకున్న ఆ వ్యక్తి అర్థరాత్రి బీభత్సం సృష్టించారు.  
 
ఇంత దారుణంగా ఆరుగురిని చంపేసిన రాజ్‌కుమార్ కూల్‌గా తన పేరెంట్స్‌కు ఫోన్ చేశాడు. తనపై అక్రమంగా పోక్సో కేసు పెట్టిన వారిని, సహకరించిన వారిని చంపేసిన నట్టు చెప్పాడు. అంతే కాకుండా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు. వాడి మాటలు విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏం చేయాలో తెలియక, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తన కుమారుడు ఇలా అంటున్నాడని చెప్పారు. వారి మాటల విన్న పోలీసుల్లో కంగారు మొదలైంది. ఆరుగురిని చంపేయడం ఏంటని టీం స్పాట్‌కు వెళ్లింది. 

అయితే ఇంతటి దారుణానికి నిందితుడు ఒడిగట్టేందుకు పోలీసులే కారణమని గ్రామస్తులంతా ఆందోళనబాటపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపైకి వచ్చి పోలీసుల తీరును తప్పుపట్టారు. పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోలేదని చెప్పారు. అందుకే నిందితుడు బరితెగించాడని ఆరోపిస్తున్నారు. 

సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో ఇలాంటి సీన్స్ చూస్తేనే కళ్లు మూసుకుంటాం, లేదంటే ఆ సీన్‌ను స్కిప్ చేస్తాం. కానీ రాజ్‌కుమార్ మాత్రం అర్థరాత్రి చేసిన దుర్మార్గం చెప్పడానికి మాటలు రావు. ఎక్కడ పడుకున్న వారిని అక్కడే కిరాతకంగా నరికి చంపాడు. తనపై కేసు పెట్టిన బాలికను ఊరి చివరకు తీసుకెళ్లి రేప్ చేసి చంపేసినట్టు తెలుస్తోంది. తన భార్య, బిడ్డలను పడుకున్న బెడ్‌పైనే కళ్లు తెరవకుండానే ఆయువు తీసేశాడు. బాధిత బాలిక తల్లి, నానమ్మను కూడా పడుకున్న చోటే లేవకుండా చేసి గొంతులు కోసేశాడు. 

పోలీసులు స్పాట్‌కు చేరుకొని అక్కడ పరిస్థితులు చూసి షాక్ అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

బాలిక ఫిర్యాదు మేరకు మే 26వ తేదీన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చిన రాజ్ కుమార్ పదే పదే వార్నింగ్‌ ఇస్తూ వచ్చాడు. తనపై కేసు పెట్టిన వారిని విడిచిపెట్టేది లేదని హెచ్చరించాడు.  ఇదే విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చామని గ్రామస్థులు అంటున్నారు. అప్పుడే అతనిపై చర్యలు తీసుకొని ఉంటే, ఆరుగురు ప్రాణాలు దక్కేవి అని అంటున్నారు.                 

టాప్ హెడ్ లైన్స్

Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
Villa Orchids Security Failure: కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ దారుణం - 5 ఏళ్ల అరేలియా హత్య - గేటెడ్ కమ్యూనిటీల భద్రత ఎంత?
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget