అన్వేషించండి

Munugode: మేం కేసీఆర్‌ని వాడుకుంటున్నాం, అందుకే మునుగోడులో సపోర్ట్ చేస్తాం - తమ్మినేని

తమ్మినేని వీరభద్రం గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో బీజేపీని ఓడించగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంటే సీపీఎం పార్టీ వాళ్ళకే మద్దతు ఇచ్చేదని తమ్మినేని చెప్పారు.

మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుండి మద్దతు కావాలని చాలా విజ్ఞప్తులు వచ్చాయని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అందులో భాగంగా తమ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మునుగోడులో బీజేపీని ఓడించడానికి టీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే, మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు కోసం కేసీఆర్ తమను వాడుకోవడం లేదని, తామే కేసీఆర్‌ ను వాడుకుంటున్నామని అన్నారు. తమ్మినేని వీరభద్రం గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

మునుగోడులో బీజేపీని ఓడించగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంటే సీపీఎం పార్టీ వాళ్ళకే మద్దతు ఇచ్చేదని తమ్మినేని చెప్పారు. కాంగ్రెస్ కు ఆ శక్తి లేకపోవడం వల్ల తాము బీజేపీని ఓడించడానికి టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కూడా కేసీఆర్ తమకు తోక పార్టీ అని విమర్శించవచ్చని, కేసీఆర్ తమను ప్రేమిస్తున్నాడని అనుకోవడం లేదని తమ్మినేని అన్నారు. బీజేపీతో కేసీఆర్ ఒకరోజు మిత్రుడిగా, ఒకరోజు శత్రువుగా ఉంటారని ఎద్దేవా చేశారు. బీజేపీతో శాశ్వత శతృత్వం సీపీఎంకే ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ విషయంలో తమ మద్దతు కేవలం మునుగోడు వరకే ఉంటుంది అని తమ్మినేని వీరభద్రం స్పష్టత ఇచ్చారు.

కాంగ్రెస్ కు రాజీనామా ఎందుకు? - తమ్మినేని
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా అని ఎందుకన్నారని తమ్మినేని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గానికి అన్యాయం చేస్తే కాంగ్రెస్ కి ఎందుకు రాజీనామా చేయాలని తమ్మినేని ప్రశ్నించారు. మునుగోడు సభలో అమిత్ షా బీజేపీని గెలిపిస్తే నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బహిరంగంగా చెప్పారని గుర్తు చేశారు. పూర్తి మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని నెల రోజుల్లో ఎలా పడగొడతారని తమ్మినేని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనేయడం,ఈడీతో బెదిరింపులు చేయడం, రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని విమర్శించారు.

మునుగోడు ఎన్నికల ఫలితం ఎలా వచ్చినా టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు బీజేపీలో చేరేలా ప్లాన్ చేశారా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ ప్రభావాన్ని తెలంగాణ లోని పార్టీలు తక్కువ అంచనా వేస్తున్నాయని అన్నారు. ఉత్తర భారతదేశంలో వారి ఆగడాలు చూస్తున్నామని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న రాజకీయాలు స్వాగతిస్తున్నామని తమ్మినేని వెల్లడించారు. 

గతవారమే వెల్లడి
మునుగోడులో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోరాడతామని తమ్మినేని వీరభద్రం గత వారమే అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేయడం లేదని అప్పుడే స్పష్టం చేశారు. అయితే, ఎవరికి మద్దతిస్తామనే అంశాన్ని మాత్రం అప్పుడు చెప్పలేదు. తాజాగా తాము టీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్నట్లుగా చెప్పారు. గత వారం భువనగిరిలో పార్టీ నేతలతో కలిసి ఆయన ఈ వివరాలు చెప్పారు. ఖమ్మం టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య గురించి మాట్లాడుతూ.. ఆ విషయంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పారు. కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు.

సీపీఐ కూడా మద్దతు
మునుగోడు ఉప ఎన్నికల్లో ఇటీవల టీఆర్ఎస్ కు సీపీఐ కూడా మద్దతు పలికింది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ మారడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని గతంలో సీపీఐ నారాయణ అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తుల బలోపేతానికి కృషి చేస్తామని, భారత దేశ సమాఖ్య వ్యవస్థను బీజేపీ సర్వనాశనం చేస్తోందని నారాయణ విమర్శించారు.

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
LB Nagar Police Constable Suicide: ఎల్బీ నగర్ పీఎస్‌లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
ఎల్బీ నగర్ పీఎస్‌లో ఉరి వేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget