MLC Jeevan Reddy: హరీష్ రావు ప్రేమ ఒలకబోస్తే ఆశ్చర్యంగా ఉంది - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Jeevan Reddy: బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం బాధాకరమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Congress MLA Jeevan Reddy: పీవీ నరసింహా రావు కాంగ్రెస్ వాదీ అని.. అలాంటి ఆయనపై నిన్న హరీష్ రావు ప్రేమ ఒలకపోస్తే.. ఆశ్చర్యంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సీఎంగా, ప్రధానిగా పీవీ పనిచేశారని అన్నారు. ఏ పదవి చేపట్టినా ఆ పదవీకి ఆయన వన్నెతెచ్చారని అన్నారు. పీవీ అంతిమ యాత్ర హైదరాబాద్ లో చేపట్టాలని అప్పట్లో కుటుంబ సభ్యులే కోరారని గుర్తు చేశారు. అన్ని లాంఛనాలతో గౌరవ వందనలతో చేశారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
నిన్న సభలో చర్చలు చూస్తుంటే.. ఉద్యమ పార్టీ అనిచెప్పుకునే బీఆర్ఎస్ నేతలు.. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్న మౌనంగా వున్నారు. భద్రాచలంకు చెందిన ఏడు మండలాలు కోల్పోయాం. స్వార్థ పూరిత రాజకీయాలకోసమే సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోవడానికి కేసీఆరే నైతిక బాధ్యత వహించాలి. ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగా వాట్ల విద్యుత్ పొందే హక్కు వుంది. కానీ 2600 మెట్ల వాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాను. ఐటీఐఆర్ తేవడంలో ఫెయిల్యూర్ అయ్యారు.
విభజన చట్టం హక్కులను సాధించడంలో విఫలమయ్యారు. విమర్శలు చేయడం బంద్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిస్ట్ స్పాట్ గా చేసిందే బీఆర్ఎస్. కాళేశ్వరం అవినీతి బయటపెడతాం. సీఎం రేవంత్ తీసుకునే నిర్ణయం శుభపరిణామం’’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.