Maheshwar Reddy: పంట నష్ట పరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయండి - సీఎం రేవంత్‌కు మహేశ్వర్ రెడ్డి లేఖ
Telangana BJP : బీజేపీ రైతులకు అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించామని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. పంట నష్ట పరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
![Maheshwar Reddy: పంట నష్ట పరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయండి - సీఎం రేవంత్‌కు మహేశ్వర్ రెడ్డి లేఖ Congress government is unable to provide assurance to farmers bjlp leader maheshwar reddy Maheshwar Reddy: పంట నష్ట పరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయండి - సీఎం రేవంత్‌కు మహేశ్వర్ రెడ్డి లేఖ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/02/0f7ad0a22ca66382e6bdb96ca08c803a17278776206161037_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Congress Govt : రైతులకు భరోసా ఇవ్వలేని స్థితిలో రేవంత్ సర్కార్ ఉందని బీజేపీ శాసన సభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Eleti Maheshwar Reddy) విమర్శించారు. ఆయన బుధవారం బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన పంట నష్ట పరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కాంగ్రెస్(Congress) తమ మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు కనీస భరోసా ఇవ్వలేని స్థితిలో సర్కార్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జిల్లా ఖమ్మం ప్రజలకు కూడా పంట పరిహారం ఇప్పించలేని స్థితిలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ( Thummala Nageshwar Rao) ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అరాచక పాలన
బీజేపీ రైతులకు అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అరాచక ప్రభుత్వాన్ని నడిపిస్తుందన్నారు. దుర్మార్గపు పాలన చేస్తున్న కాంగ్రెస్ మెడలు వంచేలా కార్యక్రమాలు చేపడతామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం తో రైతన్న లు పడుతున్న గోస చూడాలని ఆయన సూచించారు. రైతు పండించిన వడ్లకు బోనస్ ఇవ్వడం లేదు.. ఇతర పంటలకు ఇస్తానన్న బోనస్ మర్చిపోయారని మండిపడ్డారు. మా దీక్ష తో అయినా తప్పు తెలుసుకుని రైతులకు మంచి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది.. ఆయన పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ లో అయనకు పెద్దగా పట్టులేదన్నారు. హామీలను నెరవేర్చకుండా ఉన్న ప్రభుత్వ వైఫల్యాలు తుమ్మల నాగేశ్వరరావు పై పడుతున్నాయని అన్నారు.
ఎరువులకు 20వేల సబ్సిడీ
కేంద్ర ప్రభుత్వం ఎరువులకు 20వేల పై చిలుకు సబ్సిడీ ఇస్తుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ బీజేపీనే అన్నారు. మహారాష్ట్ర లో యూపీ లలో ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. తప్పుడు హామీలను ఇచ్చీ గద్దె నెక్కదలచుకోవడం లేదన్నారు. బూటకపు హామీలను ఇచ్చి గద్దెనెక్కిన తరువాత తప్పించుకునే నైజాం మాది కాదన్నారు. రూ.13వేల కోట్ల రుణమాఫీ(Runa Mafi) ఎప్పటి వరకు అకౌంట్ లలో వేస్తారని ప్రశ్నించారు. రూ.2లక్షల వరకు మాఫీ చేసే బాధ్యత కచ్చితంగా కాంగ్రెస్ రేవంత్ సర్కారుదే. వీలైనంత త్వరగా రైతుల ఖాతాలో రుణమాఫి జమ చేయాలి. 17933కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేశారో లిస్ట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మిగిలిన వారికి ఎప్పుడిస్తారు
మిగిలిన రైతులు ఎంత మంది ఉన్నారు వారికి ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పాలన్నారు. రైతులకు మూడు లక్షల వడ్డీ లేని రుణాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని మరచి పోయాడా అని ప్రశ్నించారు. బీజేపీ లో కాదు కాంగ్రెస్ లోనే కుర్చీల కోసం కుమ్ములాటలు ఉంటాయి. నిన్న తాము చేపట్టిన దీక్ష లో మా ప్రజా ప్రతినిధులం అందరం పాల్గొన్న సంగతి చూడలేదా అని అడిగారు. ఇక్కడ ఎవరు అబద్దాలు ఆడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసా విషయంలో ఇప్పటివరకు మంత్రులకే క్లారిటీ లేదంటూ ఫైర్ అయ్యారు.
Also Read : పాతబస్తీలో ఒవైసీ బిల్డింగ్స్ కూల్చే దమ్ముందా? బుల్డోజర్స్ తెప్పించాలా! ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)