By: ABP Desam | Updated at : 27 Apr 2022 12:18 PM (IST)
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్
TRS Plenary Meeting: దేశంలో ప్రజలు కరెంటు, తాగు, సాగు నీరు వంటి కనీస మౌలిక సదుపాయాల కోసం ఇంకా వెంపర్లాడే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ పరిస్థితిని మార్చేలా దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఏ సౌకర్యాలు లేని సింగపూర్, మలేసియా లాంటి దేశాల్లో అద్భుతమైన ప్రగతి ఉందని, అన్ని వనరులు ఉన్న మన దేశంలో సరైన ఆలోచన లేకపోవడం వల్ల వెనకబడి ఉన్నామని చెప్పారు. దేశం గుడ్డెద్దు చేలో పడ్డట్లు పోకుండా ఒక లక్ష్యం నిర్దేశించుకుపోవాలని అన్నారు. కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయ విధానం రావాలని ఆకాంక్షించారు. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.
దేశంలో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ‘‘భారత దేశానికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం నీటి లభ్యత. ఏకంగా 65 వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇంకో 4 నుంచి 5 వేల టీఎంసీల నీళ్ల నిధుల లెక్క తేలలేదు. ఇది అంతర్జాతీయ వివాదాల్లో ఉంది. ఇప్పటిదాకా కట్టిన నీటి ప్రాజెక్టుల ద్వారా 25 వేల టీఎంసీలలోపే దేశం వాడుకుంటోంది. బుర్ర ఉందా.. బుర్ర లేకనా? తెలివి ఉందా తెలివి లేకనా? శక్తి సామర్థ్యం ఉందా? లేకనా? వివేకమా? అవివేకమా? దీనికి కారణం ఎవరు? ఈ మాట కూడా నీతి ఆయోగ్ మీటింగ్‌లో కుండబద్ధలు కొట్టా. కావేరీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటక యుద్ధం జరుగుతోంది. కనీసం తాగునీటికి కూడా కనీస సౌకర్యాలు లేవు. నీళ్లు లేవు.. కరెంటు లేదు. కానీ, హామీలతో మైకులు పగిలిపోతున్నాయి. పరిష్కరించాల్సినవి ఈ సమస్యలపైన. అందుకోసం జరిగే ప్రయత్నంలో ఉద్విగ్నమైన పాత్ర మన రాష్ట్రం పోషించాలి. రాజకీయాల్ని ప్రభావితం చేసే ప్రయత్నం ముమ్మరంగా చేయాలి.’’ అని కేసీఆర్ అన్నారు.
‘‘తెలంగాణలో పంచాయతీ రాజ్ శాఖ పనితీరును నేను మనసు నిండా అభినందిస్తున్నాను. దేశంలో ఉత్తమ పది గ్రామాలు ప్రకటిస్తే అన్నీ తెలంగాణ గ్రామాలే ఉన్నాయి. కేసీఆర్ చెప్తేనో.. ఎర్రబెల్లి దయాకర్ రావు చెయ్యి ఊపితోనే కాలేదు. పల్లె ప్రగతితోపాటు ఎంతో మేధోమథనం చేస్తే ఉత్తమ ఫలితాలు వచ్చాయి. జ్ఞానం అందరిదగ్గరా ఉండదు. పుట్టగానే ఎవరూ తెలివిమంతులు కారు. జ్ఞానం ఎక్కడ ఉంటే అక్కడి నుంచి స్వీకరించాలి. మేధోమథనం జరిపి ఒళ్లు ఒంపి పని చేయాలి. అప్పుడే మనం కలలు కనే ఫలితాలు సాధ్యం అవుతాయి.’’ అని కేసీఆర్ అన్నారు.
దేశంలో అనవసర జాఢ్యాలు పెరుగుతున్నాయి
‘‘స్వాతంత్ర్య ఫలాలు పూర్తిగా ప్రజలకు లభించడం లేదు. పెడధోరణులు ప్రబలిపోతున్నాయి. దేశంలో కొన్ని అవాంఛితమైన, అనారోగ్యకరమైన పోకడలు చూస్తున్నాము. ఇవి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. ఇవి దేశ ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక రాజకీయ పార్టీగా దేశ అభ్యున్నతి కోసం కీలక నిర్ణయం తీసుకోవాలి. దేశంలో 4 లక్షల మెగావాట్లు విద్యుత్ శక్తి ఉంటే ఏ ఒక్క రోజు కూడా 2 లక్షలకు మించి విద్యుత్ వాడడం లేదు. ఆఖరికి గుజరాత్‌లో కూడా భయంకరమైన కరెంటు కోతలు ఉన్నాయి. దేశంలో కరెంటు కోతలు లేని రాష్ట్రమే లేదు. చుట్టూ అంధకారం ఉంటే మణిదీపంలా తెలంగాణ వెలుగుతోంది. తెలంగాణ అనుసరించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఫాలో అవ్వడం లేదు? ఈ విషయాన్ని నేను నీతి ఆయోగ్ సమావేశంలోనే చెప్పాను. కానీ, లాభం లేదు.’’ అని ప్రసంగించారు.
TS EAMCET Counselling: ఎంసెట్‌లో ఏ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోండి! గతేడాది సీట్ల కేటాయింపు ఇలా!
TSITI: తెలంగాణలో ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలు, అర్హతలివే!
Telangana Formation Day దశాబ్ది ఉత్సవాల్లో పోడు పట్టాలు, గొర్రెల పంపిణీ, న్యూట్రిషన్ కిట్లు, హరితహారం ప్రారంభం
TS EAMCET Counselling: టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల! ముఖ్యమైన తేదీలివే!
TSSPDCL: జూనియర్ లైన్‌మెన్, ఏఈ పరీక్ష ఫలితాలు విడుదల - డైరెక్ట్ లింక్స్ ఇవే!
YS Jagan In Delhi: నీతి ఆయోగ్ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే
Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం
ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు
NTR centenary celebrations : తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !