Pakala Harinath Rao: వియ్యంకుడు హరినాథ రావు దశదిన కర్మలో పాల్గొన్న సీఎం కేసీఆర్
Pakala Harinath Rao: సీఎం కేసీఆర్ తన వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ దివంగత పాకాల హరినాథ్ రావు దశనదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
Pakala Harinath Rao: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్ రావు తన వియ్యకుండు, మంత్రి కేటీఆర్ మామ దివంగత పాకాల హరినాథ్ రావు దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే దివంగత హరినాథ్ రావు చిత్ర పటానికి సిఎం కేసిఆర్ పుష్పాంజలి ఘటించారు. దివంగత హరినాథ్ కుమార్తె శైలిమ (మంత్రి కేటీఆర్ సతీమణి ), కుమారులు రాజ్ పాకాల, శైలేంద్ర పాకాలను, ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ధైర్యంగా ఉండమని భరోసానిచ్చారు. ఈ దశదిన కర్మ కార్యక్రమంలో తన కుమారుడు మంత్రి కేటీఆర్, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య ఇతర కుటుంబ సభ్యులతో కూడా ఉన్నారు.
హైదరాబాద్ లో ఈరోజు తన వియ్యంకుడు, మంత్రి శ్రీ కేటీఆర్ మామగారైన దివంగత పాకాల హరినాథ్ రావు దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. pic.twitter.com/ufKWQJylhu
— Telangana CMO (@TelanganaCMO) January 9, 2023
అలాగే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, రంజిత్ రెడ్డి, కొత్తాప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్ నేత, బీబీ పాటిల్, కవితా నాయక్, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, బస్వరాజు సారయ్య, బండ ప్రకాశ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద, కాలె యాదయ్య, రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
డిసెంబర్ 29న కన్నుమూసిన పాకాల హరినాథ రావు
తెలంగాణ సీఎం కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామయ్య (భార్య తండ్రి) పాకాల హరినాథరావు మరణించారు. ఆయన కరోనరీ సిండ్రోమ్, కార్డియోజెనిక్ షాక్, ఎనోక్సిక్ బ్రెయిన్ ఇంజూరీ కారణాలతో చనిపోయారు. ఈ మేరకు ఆయన చికిత్స పొందుతున్న ఏఐజీ ఆస్పత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. పాకాల హరినాథ్ రావు అనారోగ్యంతో ఏఐజి ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం డిసెంబరు 27న చేరారని పేర్కొన్నారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేదని డిసెంబరు 29 మధ్యాహ్నం 1.10 నిమిషాలకు చనిపోయారని ప్రకటనలో వెల్లడించారు. హరినాథరావు అక్యూట్ కరోనరీ సిండ్రోమ్, కార్డియోజెనిక్ షాక్, ఎనోక్సిక్ బ్రెయిన్ ఇంజూరీ కారణాలతో చనిపోయారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ పదజాలాన్ని వైద్య పరిభాషలో గుండెలోని రక్త నాళాలకు రక్త సరఫరా నిలిచిపోయిన సందర్భంలో వాడతారు. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇంకోవైపు, శరీరానికి కావాల్సినంత రక్తాన్ని గుండె పంప్ చేయడంలో విఫలం అవ్వడాన్ని కార్డియాక్ షాక్‌గా పిలుస్తారు. ఇది ప్రాణాపాయ స్థితిగా భావిస్తారు.