By: ABP Desam | Updated at : 09 Dec 2022 12:59 PM (IST)
భూమి పూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్‌లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ నిర్మించతలపెట్టిన మెట్రో మార్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపపన చేశారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ సమీపంలోని మైండ్ స్పేస్ వద్ద దీనికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రగతి రథం బస్సులో మైండ్ స్పేస్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు అప్పటికే అక్కడికి చేరుకున్న మంత్రులు, మేయర్ స్వాగతం పలికారు. ఆ తర్వాత శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు.
ఐటీ హబ్‌గా గుర్తింపు ఉన్న గచ్చిబౌలి-మాదాపూర్-కొండాపూర్-మైండ్ స్పేస్ టెక్నాలజీ పార్కులకు రాకపోకలు సాగించడానికి వీలుగా ఈ మార్గాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఆయా ప్రాంతాల నుంచి మెట్రో రైలు ద్వారా అతి తక్కువ సమయంలో నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకోవచ్చు. ప్రపంచ స్థాయి పెట్టుబడులతో భారీగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఎయిర్ పోర్టుకు మెట్రో మార్గాన్ని అనుసంధానం చేస్తున్నారు.
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఎయిర్ పోర్టు మెట్రో
ఎయిర్ పోర్టు మెట్రో విశేషాలను గురువారం (డిసెంబరు 8) మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టు 31 కిలోమీటర్లు నిర్మించబోతున్నామని.. దీని కోసం మొత్తం రూ.6,250 కోట్ల ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాయదుర్గం నుండి ఎయిర్ పోర్ట్ వరకు ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేశామని.. భూసేకరణ ఇబ్బంది లేదని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. సిటీ మెట్రో ప్రస్తుతం స్పీడ్ మినీమమ్ 35 కిలోమీటర్ పర్ అవర్ ఉందని, మాక్సిమమ్ 80 కిలోమీటర్లు ఉందన్నారు. అదే ఎయిర్ పోర్ట్ మెట్రో స్పీడ్ 120 మాక్సిమమ్ ఉంటుదని.. 26 నిమిషాల్లో 31 కిలోమీటర్లను చేరుకుంటామని అన్నారు. ఈ ట్రైన్ లిమిటెడ్ స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు. న్యూయార్క్, లండన్ దేశాల్లో ఉన్న బెస్ట్ ఫెసిలిటీస్ ను ఎయిర్ పోర్ట్ మెట్రోకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు.
మొదట మూడు కోచ్‌లు కానీ ఆరు బోగీలకు డిజైన్
ఎయిర్‌పోర్టు మెట్రో ట్రైన్స్ కు మూడు కోచ్ లు.. ఆ తర్వాత అవసరాన్ని బట్టి 6 కోచ్ లకు డిజైన్ చేశామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పీక్ అవర్స్ లో ప్రతి 8 నిమిషాలకు.. నాన్ పిక్ అవర్ లో ప్రతీ 20 నిమిషాలకు ఒక ట్రైన్ నడుస్తుందని.. ఆ తర్వాత 2.5 నుండి 5 నిమిషాలకు ఒక ట్రైన్ నడుపుతామని అన్నారు. సీబీఐటీసీ టెక్నాలజీతోనే ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మిస్తున్నామన్నారు. సీసీటీవీ కెమెరాలతో సెక్యూరిటీ ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో కేవలం ఎయిర్ పోర్ట్ పాసింజర్సే కాకుండా సిటీ అవుట్ స్కర్ట్ లో ఉండే వారు సిటీకి వచ్చేందుకు ఎయిర్ పోర్ట్ మెట్రో సెకండ్ ఫేజ్ ఉంటుందని.. దీనిపై జనరల్ కన్సల్టెంట్ తో ఇప్పటికే చర్చలు జరుపుతున్నామన్నారు. ఫస్ట్ ఫేజ్ లో 300 కోర్టు కేసులను గెలిచి.. 3 వేల ఎకరాల భూమి సేకరణ జరిగిందని తెలిపారు. నూతన టెక్నాలజీతో ఎయిర్ పోర్ట్ మెట్రోను పూర్తి చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.
TS High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సర్కార్‌కు మళ్లీ ఎదురుదెబ్బ, హైకోర్టులో మూసుకున్న దారులు! సుప్రీంలో పిటిషన్
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్!
Hyderabad Crime News: ప్రేమించి పెళ్లాడింది, మరో వివాహం చేసింది - తర్వాతే అసలు కథ మొదలైంది!
MLC Kavitha: ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత - 2024 ఎన్నికల చర్చకు హాజరు!
Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !
Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం
Balakrishna Phone : బాలకృష్ణ ఏ ఫోన్ వాడుతున్నారో చూశారా? పాకెట్లో ఎలా స్టైలుగా పెట్టారో?
Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?