అన్వేషించండి

Telangana Secretariat: కొత్త సెక్రెటేరియట్ వద్దకు సీఎం కేసీఆర్, భవనం మొత్తం పరిశీలన - కీలక ఆదేశాలు

Secretariat Construction: కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడవద్దని, పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.

Telangana New Secretariat: నాణ్యతలో ఏమాత్రం రాజీపడకుండా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. సెక్రటేరియట్ లో జరుగుతున్న నిర్మాణాలన్నింటినీ ముఖ్యమంత్రి కలియ తిరుగుతూ నిశితంగా చూశారు. 

పనుల్లో వేగం పెరగాలి..

నిర్దేశించుకున్న డిజైన్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా? అని మంత్రిని, అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఏక కాలంలో అన్ని పనులు వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావద్దని పేర్కొన్నారు. స్లాబుల నిర్మాణం, భవనం పైన డూమ్స్ ఏర్పాటు, ఇంటీరియర్ పనులతో పాటు ఫర్నీచర్ విషయంలో నూతన మోడల్స్ ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. మంత్రుల ఛాంబర్లు, మీటింగ్ హాల్స్, యాంటీ రూమ్స్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

సెక్రటేరియట్ పనుల పరిశీలనలో సీఎం శ్రీ కేసీఆర్ తో పాటు మంత్రులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు శ్రీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ శ్రీ శంభీపూర్ రాజు (Contd.)

— Telangana CMO (@TelanganaCMO) August 17, 2022

">

కొత్త సచివాలయం 'పచ్చ'గా ఉండాలి..

కొత్త సెక్రటేరియట్ భవనం మధ్య భాగంలో సుమారు 2 ఎకరాల ఖాళీ స్థలంతో పాటు, సెక్రటేరియట్ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పనులు అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రిల్స్ నిర్మాణ పనుల నాణ్యత గురించి సీఎం ఆరా తీశారు. రెడ్ స్టోన్, డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. విజిటర్స్ లాంజ్ నిర్మాణ పనులను, సెక్రటేరియట్ వాల్ వెంబడి మట్టి ఫిల్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సెక్రటేరియట్ కు వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ జిల్లాల నుండి సెక్రటేరియట్ కు వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

సౌకర్యవంతంగా ఛాంబర్ల నిర్మాణం..

మంత్రులు, సెక్రటరీలు, ఆయా శాఖల సిబ్బంది సౌకర్యవంతంగా పనులు చేసుకునేందుకు వీలుగా ఛాంబర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్ లోనే.. పనులు జరుగుతున్న తీరు గురించి సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు. పనులకు సంబంధించిన ఆల్బమ్ ను పరిశీలిస్తూ, ఒక్కో పని గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. 

సెక్రటేరియట్ పనుల పరిశీలనలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కె.పి.వివేకానంద, బేతి సుభాష్ రెడ్డి, ఎ.జీవన్ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వేద సాయిచంద్, ఆర్.అండ్.బి ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్, హైదరాబాద్ సీపీ సీ.వీ.ఆనంద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Kamareddy Crime News: కామారెడ్డిలో ఇంకా వీడని మిస్టరీ, ముగ్గురి మృతిపై ఆ ప్రచారంలో నిజం లేదు
కామారెడ్డిలో ఇంకా వీడని మిస్టరీ, ముగ్గురి మృతిపై ఆ ప్రచారంలో నిజం లేదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Kamareddy Crime News: కామారెడ్డిలో ఇంకా వీడని మిస్టరీ, ముగ్గురి మృతిపై ఆ ప్రచారంలో నిజం లేదు
కామారెడ్డిలో ఇంకా వీడని మిస్టరీ, ముగ్గురి మృతిపై ఆ ప్రచారంలో నిజం లేదు
Sankranti Special Buses:  సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారికి గుడ్ న్యూస్ - అదనపు ఛార్జీలు లేకుండా 2,400 ప్రత్యేక బస్సులు
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Khan Sir : స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు..?
స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు
Embed widget