Laptop For Rs 4000: తక్కువ ధరకే ల్యాప్‌టాప్ ఆఫర్.. దిల్‌సుఖ్‌నగర్‌లో ఎగబడిన జనాలు. ఊపిరాడనంత రద్దీ!
Hyderabad Viral News | అతి తక్కువ ధరకే ల్యాప్‌టాప్ విక్రయిస్తున్నామని సోషల్ మీడియాలో పోస్ట్, వీడియో చూసిన నెటిజన్లు దిల్‌సుఖ్ నగర్‌లో గుంపుగా ఎగబడ్డారు.

Laptop Offer sale in Hyderabad | హైదరాబాద్: నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ షాపు వద్ద ఆదివారం జనసందోహంతో దద్దరిల్లిపోయింది. కేవలం 4,000 రూపాయలకే ల్యాప్‌టాప్ అందిస్తున్నామంటూ ఒక సంస్థ ప్రకటించిన ‘బంపర్ సేల్’ ప్రకటన వినియోగదారులను భాగా ఆకర్షించింది. అతి తక్కువ ధరకే బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు లభిస్తాయన్న ఆశతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి, చుట్టు పక్కల జిల్లాల నుంచి సైతం వేల సంఖ్యలో ప్రజలు తెల్లవారుజాము నుంచే యువ కంటప్యూటర్ షాపు ముందు క్యూ కట్టారు. సమయం గడుస్తున్న కొద్దీ రద్దీ షాపు ముందు విపరీతంగా పెరగడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. సోషల్ మీడియాలో ఆఫర్ ప్రకటన చూసి
షాపు ముందు నెలకొన్న విపరీతమైన రద్దీ కారణంగా కొందరు వినియోగదారులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తోపులాటలు జరిగే అవకాశం ఉండటంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనేలా కనిపించింది. తక్కువ ధరకు విక్రయాలు అని ఆఫర్ ప్రకటించినప్పుడు, భారీ స్థాయిలో జనం వస్తారని తెలిసినా, నిర్వాహకులు అందుకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదని వచ్చిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని సైతం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. క్యూ పద్ధతిలో వెళ్లాలని, నెట్టుకోవడం ద్వారా తోపులాట జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.
రూ.4 వేలకే ల్యాప్‌టాప్.. షాప్ ముందు జనం బారులు
— PulseNewsBreaking (@pulsenewsbreak) December 28, 2025
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో.. రూ.4 వేలకే ల్యాప్‌టాప్ అంటూ ఓ ప్రకటన
తక్కువ ధరకే బ్రాండెడ్ ల్యాప్‌టాప్ దొరుకుతుందని.. భారీగా తరలివచ్చిన ప్రజలు
ఉదయం నుంచి క్యూ కట్టిన జనం.. ఊపిరి ఆడని స్థాయిలో షాప్ వద్ద భారీ రద్దీ pic.twitter.com/RyGhvB1EOT
తక్కువ ధర సేల్స్‌లో గమనించాల్సిన జాగ్రత్తలు
ఇలాంటి భారీ డిస్కౌంట్లు లేదా తక్కువ ధర ప్రకటనలు చూసినప్పుడు వినియోగదారులు కొన్ని కీలక విషయాలను గుర్తుంచుకోవాలి. ఇంత తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు ఇస్తున్నారంటే అవి సెకండ్ హ్యాండ్ (Refurbished) అయ్యే అవకాశం ఉంటుంది. కొనే ముందు హార్డ్‌వేర్ పనితీరును పూర్తిగా తనిఖీ చేయాలి. కొన్నిసార్లు కొందరు కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్రకటనలు ఇస్తుంటారు. స్టాక్ పరిమితంగా ఉంచి, మిగిలిన వారు నిరాశగా వెనుదిరిగే అవకాశం ఉంటుంది.
ఇలాంటి రద్దీ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తోపులాటలు జరిగే ప్రమాదం ఉంటుంది. కనుక ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇటువంటి చోటుకు వెళ్లేటప్పుడుచాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అతి తక్కువ ధరకు కొన్నా సరే, దానికి సంబంధించిన ప్రాపర్ బిల్లు, వారంటీ వివరాలను అడిగి తెలుసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో రిపేర్లు వచ్చినా, ఐటెం పాడైపోయినా ఇబ్బంది కలగకుండా ఉంటుంది.






















