Protest in Metro: చంద్రబాబు మద్దతుదారుల ఆందోళనతో మియాపూర్ మెట్రో కాసేపు మూసివేత
చంద్రబాబు మద్దతుదారుల ఆందోళనలతో మియాపూర్ మెట్రో స్టేషన్‌ను కాసేపు మూసేశారు పోలీసులు. మిగిలిన మెట్రోస్టేషన్లలోనూ భద్రత పెంచారు. ప్రయాణికులను చెక్ చేసి మెట్రో స్టేసన్లలోకి పంపుతున్నారు.
చంద్రబాబు మద్దతుదారుల ఆందోళనలతో మియాపూర్ మెట్రో స్టేషన్‌ను కాసేపు మూసేశారు పోలీసులు. మిగిలిన మెట్రోస్టేషన్లలోనూ భద్రత పెంచారు. ప్రయాణికులను చెక్ చేసి మెట్రో స్టేసన్లలోకి పంపుతున్నారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఏపీలోనే కాదు హైదరాబాద్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ర్యాలీ, ధర్నాలు చేసిన టీడీపీ కార్యకర్తలు.. ఇప్పుడు ఏకంగా మెట్రో స్టేసన్లలో నిరసనకు దిగారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్ల దగ్గర హైఅలర్ట్ కొనసాగుతోంది. మియాపూర్ మెట్రో స్టేషన్‌కు మూసివేశారు పోలీసులు. మిగిలిన అన్ని మెట్రో స్టేషన్ల దగ్గర భద్రత పెంచారు. ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మెట్రో స్టేషన్ల లోపలికి పంపుతున్నారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వినూత్న కార్యక్రమం చేపట్టారు కార్యకర్తలు, అభిమానులు. లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరుతో... నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఉదయం మియాపూర్ మెట్రో స్టేషన్లోకి చంద్రబాబు మద్దతుదారులు వందలాదిగా తరలివచ్చారు. నల్ల దుస్తులు ధరించి వచ్చి... చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ స్టేషన్ వెళ్లే మెట్రో ఎక్కి.. నిరసన తెలిపారు. చంద్రబాబు మద్దతుదారులు భారీగా తరలిరావడంతో మెట్రో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మియాపూర్ మెట్రో స్టేషన్‌ను కాసేపు మూసివేశారు. ఆ తర్వాత ప్రయాణికులను అనుమతించారు. నల్ల దుస్తులు ధరించిన వచ్చిన వారిని చెక్ చేసిన తర్వాత లోపలికి పంపుతున్నారు.
ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర మధ్య మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించాలని చంద్రబాబు మద్దతుదారులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా.. ఉదయం మియాపూర్ మెట్రో స్టేషన్‌కు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు మద్దతుదారుల ఆందోళనతో.. హైదరబాద్ మెట్రోస్టేషన్ల దగ్గర హైఅలర్ట్ కనిపించింది. అన్ని స్టేషన్ల దగ్గర భద్రత పెంచారు పోలీసులు. కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు.
స్కిల్ స్కామ్ చంద్రబాబును సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు ఏపీ సీఐడీ పోలీసులు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీలో ఆందోళన, నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా అప్పుడప్పుడు ఆందోళనలు నిర్వహించారు చంద్రబాబు మద్దతుదారులు. ఇటీవల మోత్కుపల్లి కూడా దీక్ష చేపట్టారు. ఇప్పుడు... ఒక్కసారిగా మెట్రో స్టేషన్లలో నిరసన చేపట్డంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. బ్లాక్ టీషర్ట్ ధరించి వస్తున్న ప్రయాణికులపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.
చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్షపూరిత చర్య అంటూ ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. వందలాది మంది మెట్రోస్టేషన్‌లోకి వచ్చి నినాదాలు చేయడంతో.. సామాన్య ప్రయాణికులు భయాందోళన చెందారు. హైదరాబాద్ మెట్రో స్టేసన్ల దగ్గరకు నల్లచొక్కాలు, బ్లాక్ టీషర్టులు వేసుకుని వచ్చే వారిని ఓ కంట కనిపెడుతున్నారు పోలీసులు. నిన్న మంత్రి కేటీఆర్ కూడా లోకేష్ ట్వీట్ చూసి బాధేసిందని అన్నారు. చంద్రబాబుకు ఆరోగ్యపరంగా అపాయం ఉందని చెప్పడం బాధనిపించిందని చిట్‌చాట్‌లో తెలిపారు. అయితే.. అది ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పార్టీ మధ్య విషయమని... హైదరాబాద్‌లో శాంతియుత వాతావరణం కోరుకుంటున్నామని అన్నారు.