Kalvakuntla Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు సీబీఐ నోటీసులు
Kavitha News: గతంలో సీబీఐ కవిత నివాసం వద్ద స్టేట్‌మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటిసుల్లో ఆదేశించింది.
MLC Kalvakuntla Kavitha News: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ కవిత నివాసం వద్ద స్టేట్‌మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటిసుల్లో ఆదేశించింది.
లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు గతంలో ఆమె ఇంటి దగ్గర విచారణ చేశారు. తాజాగా మళ్లీ సీబీఐ నోటీసులు ఇవ్వటంతో ఈ లిక్కర్ కేసులో కదలిక వచ్చింది. గతంలో ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత హాజరుకావడం లేదు. తాజాగా సీబీఐ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత ఈడీపై వేసిన పిటిషన్ ఫిబ్రవరి 16న సుప్రీం కోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులను కవిత గతేడాది సుప్రీంకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీం కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ల బెంచ్ దీన్ని విచారణ చేసింది. సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ కేసు విచారణ పెండింగ్ లో ఉండటం వల్ల లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు ఇస్తు్న్నప్పటికీ కవిత గైర్హాజరవుతున్నారు.