అన్వేషించండి

తెలంగాణలో క్యాపిటల్యాండ్ రూ.6,200 కోట్ల పెట్టుబడులు, మాదాపూర్‌లో పెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం

CapitaLand India Trust: తెలంగాణలో సుమారు 6,200 కోట్ల రూపాయలతో తన పెట్టుబడి ప్రణాళికలను కాపిటలాండ్ కంపెనీ మంగళవారం ప్రకటించింది. మాదాపూర్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.

CapitaLand India Trust signs MoU with Telangana government: తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు కాపిటలాండ్ కంపెనీ ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి సుమారు 6,200 కోట్ల రూపాయలతో తన పెట్టుబడి ప్రణాళికలను మంగళవారం ప్రకటించింది. ఈ 6,200 కోట్ల రూపాయల పెట్టుబడిలో.... ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపింది. 1,200 కోట్ల (S$210 మిలియన్లు) పెట్టుబడితో హైదరాబాద్ మాదాపూర్‌లోని CLINT ఇంటర్నేషనల్ టెక్ పార్క్ లో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ ఈ డేటా సెంటర్ ఏర్పాటుచేస్తుంది. 250,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల (MW) విద్యుత్ సామర్థ్యం కలిగి ఉండే ఈ  ITPH డేటా సెంటర్‌ను 5 సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తమకున్న సుమారు 6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న ఐదు సంవత్సరాలలో మరో ఐదు వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. 

భవిష్యత్తును మరింత మెరుగుపరచడంలో డేటాది కీలక పాత్ర
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్‌లలో హైదరాబాద్ ఒకటన్నారు ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు. మానవ భవిష్యత్తును మరింత మెరుగుపరచడంలో డేటానే కీలక పాత్ర పోషించబోతున్నారు. క్యాపిట ల్యాండ్ ఇండియా ట్రస్ట్ (CLINT)తో కలిసి తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, తెలంగాణలో క్యాపిటల్యాండ్ పెట్టుబడులు పెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ లో రోజురోజుకు డెవలప్ అవుతున్న IT పరిశ్రమ అవసరాలు ఈ డేటా సెంటర్ తో తీరుతాయన్నారు. ఇంతేకాకుండా ఇతర IT/ITeS మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలోనూ క్యాపిటల్యాండ్ తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కేటీఆర్. 
మాదాపూర్‌లో డేటా సెంటర్ ఏర్పాటు
సుమారు 1,200 కోట్ల (S$210 మిలియన్లు) పెట్టుబడితో హైదరాబాద్ మాదాపూర్‌లోని CLINT ఇంటర్నేషనల్ టెక్ పార్క్ లో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. 250,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల (MW) విద్యుత్ సామర్థ్యం కలిగి ఉండే ఈ  ITPH డేటా సెంటర్‌ను 5 సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని CLINT చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ దాస్‌గుప్తా తెలిపారు. నవీ ముంబై కి చెందిన గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ డెవలప్‌మెంట్ సైట్‌ను కొనుగోలుతో 2021 లో ఇండియన్ డేటా సెంటర్ మార్కెట్‌లోకి తమ కంపెనీ ప్రవేశించిందన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటుచేస్తున్న డేటా సెంటర్ రెండవదన్నారు. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణం కారణంగానే తాము ఇక్కడ పెట్టుబడి పెడుతున్నామన్నారు. 

ఆసియా, యూరప్ లో ఉన్న 25 డేటా సెంటర్ లతో గత కొన్ని సంవత్సరాలుగా డేటా సెంటర్ డిజైన్, అభివృద్ధి, నిర్వహణ లో తాము మిగతా వారి కంటే ఎంతో ముందున్నామని క్యాపిటల్ ల్యాండ్ ప్రైవేట్ ఈక్విటీ ఆల్టర్నేటివ్ అసెట్స్, రియల్ అసెట్స్ సీఈఓ  పాట్రిక్ బూకాక్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనుకున్న తమ ప్రణాళికలో భాగంగా క్యాపిటాల్యాండ్ ఇండియా ట్రస్ట్‌తో కలిసి ఇండియాలో రెండవ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే డేటా సెంటర్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉంటుందన్నారు. డేటా రంగంలో ఇండియాలో నెంబర్ వన్ గా నిలవాలన్న తమ ఆకాంక్షలకు అనుగుణంగా హైదరాబాద్ సెంటర్ ఉంటుదన్నారు. ఈ ఎంఓయూ కార్యక్రమంలో వాణిజ్య శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget