KTR Padayatra: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర- కార్యకర్తల ఆకాంక్షల మేరకు కీలక నిర్ణయం
KTR News: తెలంగాణలో పాదయాత్ర చేసేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు. దీపావళి రోజున నెటిజన్లతో ఇంట్రాక్ట్ అయిన సందర్భంగా కీలక విషయాలు షేర్ చేశారు.
Telangana News: బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు అభ్యర్థన మేరకు సమీప భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ ప్రకటించారు. దీపావళిరోజున సోషల్ మీడియోలో నెటిజన్లతో ఇంట్రాక్ట్ అయ్యారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ టైంలోనే పాదయాత్ర ప్రస్తావన వచ్చినప్పుడు తాను చేయబోతున్నట్టు వెల్లడించారు.
దీపావళి రోజున నెటిజన్లతో కేటీఆర్ ఇంట్రాక్ట్ అయ్యారు. దాదారు గంటన్నర పాటు సాగిందీ లైవ్ డిస్కషన్. రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాలు, సినిమాలు ఇలా చాలా అంశాలపై అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. కాంగ్రెస్ పాలన తెలంగాణ రాష్ట్రానికి శాపంలా మారిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం లేకనే అబద్ధాల మీద, అసత్యాల మీద టైం వేస్ట్ చేస్తూ మోసం చేస్తున్నారన్నారు. పది నెలల కాలంలో కాంగ్రెస్ చేసిన ఒక్క మంచి అయినా గుర్తు రావడం లేదన్నారు. అబద్ధపు హామీల మీద ఎన్నికైన కాంగ్రెస్ నుంచి ఇంతకంటే గొప్ప పాలన ఆశించలేమన్నారు.
వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులు ప్రారంభించింది అన్నారు కేటీఆర్. సన్నవడ్లకు బోనస్ ఇస్తామన్న హామీ బోగస్‌గా మారిందని, ఓట్లు వేసిన రైతులు కనీస ధర లేక రైతుబంధు రాక నష్టపోతున్నారన్నారు. కాంగ్రెస్ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పతనం
4 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారం పోవడం ఖాయమని... కానీ చేసిన నష్టం నుంచి తెరుకోవడం అతిపెద్ద సవాలుగా కేటీఆర్ అభివర్ణించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనమైందన్నారు. అన్ని రంగాల్లో వెనక్కి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయ వనరులుస వ్యవసాయ, అన్ని రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. నిరుద్యోగితక పెరిగిందని కంపెనీలు తరలిపోతున్నాని, దీనిపై ప్రభుత్వానికి ప్రణాళికలు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు.
ప్రజల పక్షాన కోట్లాడడమే
ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడంపైన దృష్టి సారించామని తెలిపిన కేటీఆర్. హామీల అమలుతోపాటు తీసుకున్న నిర్ణయాల్లో పారదర్శకతపై కొట్లాడుతామన్నారు. కాంగ్రెస్ ని మార్చే అవకాశం ఉందా అని అడిగితే నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిందే అన్నారు. ఐదు సంవత్సరాల కోసం అవకాశం ఇచ్చారు కాబట్టి గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి బిజెపికి వెళ్తారా అని అడిగితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమన్నారు. కాంగ్రెస్ చరిత్ర చూస్తే పరిణామైనా జరగవచ్చు అన్నారు
చెరువుల సంరక్షణపై ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ అసలైన ఎజెండా అవినీతి మాత్రమే అన్నారు కేటీఆర్. మూసి బ్యూటిఫికేషన్‌కి వ్యతిరేకం కాదన్నారు. కానీ మూసీ ప్రక్షాళణ దేశంలోనే అతిపెద్ది అవినీతి స్కాం అవుతుందన్నారు. హైడ్రా కొందరినే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది ఇప్పటిదాకా ఒక్క పెద్ద బిల్డర్‌ని కూడా ముట్టుకోలేదన్నారు. పేదలు మధ్యతరగతి ప్రజలనే దోచుకున్నదన్నారు.
సోషల్ మీడియా వారియర్లపై ప్రశంసలు
ఎన్నికల్లో ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో పార్టీ మద్దతుదారులు యాక్టివ్ అయ్యారన్నారు. ఏం ఆశించకుండానే అద్భుతంగా పని చేస్తున్నారని, ఇంత బలమైన బృందాన్ని కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్న ప్రధాన మీడియాకి ప్రత్యామ్నాయం సోషల్ మీడియా మాత్రమే అన్నారు.
పోలీసు వేధింపులపైన హెచ్చరిక
విధులు మరిచి, చట్ట విరుద్ధంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులపైన రెచ్చిపోతున్న పోలీస్ అధికారులను గుర్తుపెట్టుకుంటామన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వాధినేతలను ప్రసన్నం చేసుకునే పనుల్లో కొందరు పోలీసు అధికారులు బిజీగా ఉండడంతో శాంతి భద్రతలు క్షీణించాయని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి హోంమంత్రి అవసరం ఉందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించమని తెలిపారు. మతపరమైన హింస వాంఛనీయం కాదన్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో 144 సెక్షన్ విధించడం షాక్‌కు గురి చేసింది అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ బిజెపి కలిసి పని చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అనేక అంశాల్లో కుమ్మకై పని చేస్తున్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన హామీలను తప్పుతున్న కాంగ్రెస్ లాంటి పార్టీలపైన చర్యలు తీసుకునేందుకు బలమైన ఎన్నికల సంస్కరణలు అవసరమన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లోను జాతీయ పార్టీలను నమ్మొద్దని స్థానిక పార్టీలకు ఓటు వేయాలన్నారు. తమిళనాడు విజయ్ దళపతికి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయపరమైన అంశాల పట్ల విభేదాలే తప్ప తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకులందరితో మంచి అనుబంధం ఉన్నదన్నారు
ప్రజలే సాధారణ వ్యక్తులను నేతలుగా తయారు చేస్తారని నమ్మకం అన్నారు కేటీఆర్. బిఆర్ఎస్ పార్టీ బలంగా తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండే అవకాశం వలన నిబద్ధత కలిగిన, బలమైన నూతన నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. నిజం కన్నా పర్సెప్షన్, పీపుల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని ఓటమి నేర్పిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన అబద్ధపు హామీలు ప్రజల్లో అవాస్తవికమైన ఆశల్ని రేకెత్తించాయని, రెండుసార్లు వరుసగా గెలవడంతో యాంటీ ఇన్ కంబెన్సీ కూడా కొంత ప్రభావం చూపిందన్నారు.
10 స్థానాలకు ఉపఎన్నికలు
ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో బిజెపి మరొక జుమ్లా చేస్తోందన్నారు కేటీఆర్. తీసుకొచ్చే చట్టం ఎలాంటిదో చూడాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇది అసాధ్యం అని తెలిపారు. గ్రూప్ వన్ అభ్యర్థులకు పూర్తి మద్దతు ఉంటుందన్న కెటిఅర్... పార్టీ తరఫున వారికి అండగా ఉంటామన్నారు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకువస్తామన్నారు.