అన్వేషించండి

KCR Latest News: ఫోన్ ట్యాపింగ్‌ విచారణ కోసం కేసీఆర్ ఎందుకు సమయం కోరారు! నోటీసులపై ఉన్న అభ్యంతరాలేంటి?

KCR Latest News: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు శుక్రవారం రావాలని సిటి ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ స్పందించారు. తనకు సమయం కావాలని కోరారు. ఈ మేరకు సిట్‌కు లేఖ రాశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మున్సిపల్ ఎన్నికల కారణంగా ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ తెలిపారు.
  • చట్టం ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారిని వారి నివాసంలోనే విచారించాలని కోరారు.
  • తన ఎర్రవల్లి నివాసానికి వచ్చి విచారించాలని సిట్ అధికారులకు సూచించారు.
  • బాధ్యతాయుత పౌరుడిగా చట్టపరంగా సహకరిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.

KCR Latest News: టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం జరిగే విచారణకు హాజరుకాలేనని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత సిట్‌కు సమాచారం అందించారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణకు రాలేనని చెప్పారు. విచారణ వాయిదా వేయాలని కోరారు. ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌లోని విచారించాలని చెప్పారు. 

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒక వైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగి, రాజకీయం వేడెక్కుతున్న వేళ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులపై కేసీఆర్ తనదైన శైలిలో చట్టబద్ధమైన పకడ్బందీ వివరణతో సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల విధులను ప్రస్తావిస్తూనే, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా విచారణకు సహకరిస్తానని అయితే అది చట్టం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే జరగాలని ఆయన స్పష్టం చేశారు. 

పోలీసు అధికారులు జనవరి 30న   విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన కేసీఆర్ ప్రస్తుతం రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు , 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని గుర్తు చేశారు. ఈ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరుగుతున్నందున, అభ్యర్థులకు బీ ఫారాలు జారీ చేయడం, పార్టీ తరఫున ఇతర అధికార లాంఛనాలను పూర్తి చేయడంలో తాను నిమగ్నమై ఉన్నానని ఆయన వివరించారు. రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తున్న వేళ సమయానికి అందుబాటులో ఉండటం సాధ్యం కాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. 

కేసీఆర్ తన సమాధానంలో కేవలం రాజకీయ కారణాలనే కాకుండా, చట్టంలోని కీలక నిబంధనలను కూడా ప్రస్తావించారు.సీఆర్‌పీసీ సెక్షన్‌ 160ని ఉటంకిస్తూ, దర్యాప్తు అధికారులు సాక్షులను లేదా విచారించాల్సిన వ్యక్తులను ఎక్కడ విచారించాలనే విషయాన్ని గుర్తు చేశారు. 

Image

65 ఏళ్లు పైబడిన వాళ్లను దివ్యాంగులను, నివసించే ప్రాంతం కాకుండా ఇతర చోట్ల విచారణ నిమిత్తం పిలవకూడదని చట్టం చెబుతోందని ఆయన తెలిపారు. చట్టం ప్రకారం 65 ఏళ్లు పైబడిన వ్యక్తిని దర్యాప్తు బృందం వారు నివసించే చోటే విచారించాల్సి ఉంటుందని అన్నారు. ఈ నిబంధన మరేకు తనను విచారించాలనుకుంటే సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని తన నివాసానికి రావాలని పోలీసులకు సూచించారు. అధికారుల వీలును బట్టి మరో తేదీని ఖరారు చేయాలని, ముందస్తు నోటీసుతో తన నివాసానికి వచ్చి విచారణ జరపవచ్చని ఆయన స్పష్టం చేశారు. 

Image

రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశానని, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నానని కేసీఆర్ తన లేఖలో నొక్కి చెప్పారు. ఈ దేశపు బాధ్యతాయుతమైన పౌరుడిగా దర్యాప్తుకు తన పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా దర్యాప్తు సంస్థలు అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు తాను సిద్ధమని, అయితే అది చట్టం కల్పించే వెసులుబాటు మేరకు తన ఇంట్లోనే జరగాలని ఆయన కోరారు. భవిష్యత్‌లో నోటీసులు ఏవైనా ఉంటే తన ఎర్రవల్లి నివాసానికే పంపాలని సూచించారు.        

Frequently Asked Questions

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావడంపై కేసీఆర్ సిట్‌కు ఏమి తెలియజేశారు?

మున్సిపల్ ఎన్నికల కారణంగా శుక్రవారం జరిగే విచారణకు హాజరుకాలేనని, విచారణ వాయిదా వేయాలని మాజీ సీఎం కేసీఆర్ సిట్‌కు సమాచారం అందించారు.

కేసీఆర్ విచారణకు ఎక్కడ హాజరుకావాలని కోరారు?

చట్టంలోని నిబంధనల ప్రకారం, 65 ఏళ్లు పైబడిన వ్యక్తిని వారి నివాసంలోనే విచారించాలని, కాబట్టి తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని కేసీఆర్ కోరారు.

మున్సిపల్ ఎన్నికలు కేసీఆర్ విచారణకు హాజరుకావడానికి ఎలా ఆటంకం కలిగిస్తున్నాయి?

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల కారణంగా, పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నందున, నామినేషన్ల దాఖలు గడువు ముగిసే సమయంలో సమయానికి అందుబాటులో ఉండటం సాధ్యం కాదని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్ తన సమాధానంలో ఏ చట్ట నిబంధనను ప్రస్తావించారు?

కేసీఆర్ తన సమాధానంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 160ని ఉటంకిస్తూ, 65 ఏళ్లు పైబడిన వారిని, దివ్యాంగులను, వారి నివాస ప్రాంతం కాకుండా ఇతర చోట్ల విచారించకూడదని పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Embed widget