Shamshabad: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు - సిబ్బంది తనిఖీలలో ఏం తేల్చారంటే!
Shamshabad: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అనంతరం ఈ కాల్ ఫేక్ అని గుర్తించిన అధికారులు.. ఆగంతకుడిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.

Shamshabad: ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా పలు జాతీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం సర్వసాధారణమైపోయింది. గతంలో ఒక్కరోజే 100 ఇండియన్ ఎయిర్‌లైన్స్ (Indian Airlines) విమానాలకు బెదిరింపు కాల్స్, ఈ మెయిల్స్ వచ్చినట్లు స్వయంగా ఏవీయేషన్ అధికారులే వెల్లడించారు. తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport)కు మరోసారి బాంబు బెదిరింపు కాల్ (Bomb Threat Call) వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి సైబరాబాద్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి, బెదిరించినట్టు సమాచారం. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ఆగంతకుడు చేసిన బాంబు బెదిరింపు కాల్ ఫేక్ అని ఎయిర్ పోర్ట్ అధికారులు తేల్చేశారు. దీంతో ప్రయాణికులతో పాటు అధికారులూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ క్రమంలోనే విమానాశ్రయానికి ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి ఎవరా అని పోలీసులు ఆరా తీశారు. ఈ సందర్భంగా చేసిన దర్యాప్తులో బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని తెలంగాణలోని కామారెడ్డి వాసిగా గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. ఫేక్ కాల్ చేసిన నిందితుడికి మతిస్థిమితం సరిగ్గా లేదని అధికారులు వెల్లడించారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విజయలక్ష్మి అరెస్ట్
కుత్బుల్లాపూర్ లోని మల్లంపేట్ లో అక్రమంగా లేఅవుట్ చేసి విల్లాలు నిర్మించిన లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ (Laxmi Srinivasa Constructions) నిర్వాహకురాలు విజయ లక్ష్మిని ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను దుండిగల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయలక్ష్మి పలు భూ కబ్జా కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. గతంలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కు చెందిన కొన్ని విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో అప్పటి నుంచి విజయలక్ష్మి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతోంది. తాజాగా ఎయిర్ పోర్ట్ లో పట్టుబడింది.
అంతకుముందు జనవరి 26న రిపబ్లిక్ డే(Republic Day) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిఘా చర్యలను కఠినతరం చేశారు. అప్పట్నుంచి ప్రయాణికుల వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తీసుకెళ్లకుండా నిషేధించారు. దాంతో పాటు జనవరి 30 వరకు ఎయిర్ పోర్ట్‌కు సందర్శకులు రాకుండా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Also Read : Hyderabad News: నాన్ వెజ్ లవర్స్‌కు షాక్, నేడు హైదరాబాద్‌లో చికెన్, మటన్ షాపులు బంద్ - కారణం ఇదే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

