అన్వేషించండి

Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్

Telangana News: మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ వీడియో వైరల్ గా అయింది.

Eatala Rajender Malla Reddy video: బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తరచూ నోరు జారి లేదా తనదైన శైలిలో కామెంట్లు చేసి హైలైట్ అయ్యే ఆయన తాజాగా మరోసారి కూడా అలాగే వ్యవహరించారు. ఈసారి పార్టీ లైన్ దాటి వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. మల్కాజ్ గిరిలో బీజేపీ అభ్యర్థి గెలుస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున అభ్యర్థిగా ఈటల రాజెందర్ ఉన్న సంగతి తెలిసిందే. 

ఈసారి మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ గెలుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో జరిగిన ఒక ఫంక్షన్ లో ఈ ఆసక్తికర పరిణామం జరిగింది. అదే ఫంక్షన్ కు మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా హాజరయ్యారు. అలా ఆ ఫంక్షన్ లో మల్లారెడ్డి, ఈటల రాజేందర్ కలుసుకున్నారు. ఆప్యాయంగా ఒకరితో మరొకరు ఫోటో దిగారు. అడిగి మరీ ఈటలతో ఫోటో దిగారు.. మల్లారెడ్డి. మల్కాజ్ గిరిలో ఈసారి నువ్వే గెలుస్తున్నవ్ అన్నా.. అంటూ మాట్లాడారు. ‘‘మల్కాజిగిరిలో ఇంకెవరు గెలుస్తారు. నువ్వే గెలుస్తున్నవ్’’ అంటూ ఈటల రాజేందర్ ను గట్టిగా హత్తుకున్నారు. 

ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాలను షాక్ కు గురి చేసినట్లు అయింది. ఓవైపు పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు కోసం బీఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి రోడ్ షోల ద్వారా జనాల్లోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్ అత్యధిక ఓట్లు సాధించుకోవడం కోసం కష్టపడుతుంటే.. ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈటల రాజేందర్ తో ఇలా వ్యవహరించడం చర్చనీయాంశం అవుతోంది.

మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మల్కాజ్ గిరిలో మొతం ఏడు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాంటి చోట బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని స్వయంగా మల్లారెడ్డి బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget