HMDA టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు, 100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు
ACB Raids: హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు భారీ తిమింగలాన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్ మెంట్ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై, ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
Hyderabad ACB Raids: హైదరాబాద్ లో ఏసీబీ అధికారులు భారీ తిమింగలాన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్ మెంట్ పట్టణ ప్రణాళిక విభాగం (Hmda) డైరెక్టర్ శివబాలకృష్ణ (Shiva Balakrishna)ఇంటిపై, ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వంద కోట్లకుపైగా ఆస్తులు బయటపడినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచే 14 బృందాలు.. బాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించాయి. ఇప్పటి వరకు రూ.100 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు బయటపడినట్లు తెలుస్తోంది. బ్యాంక్ లాకర్లు తెరవాల్సి ఉండటంతో ఇంకెన్ని ఆస్తులు ఉంటాయోనని అవినీతి నిరోధక శాఖ అధికారులు షాకవుతున్నారు. గురువారం కూడా తనిఖీలు కొనసాగిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. శివబాలకృష్ణ నివాసంలో క్యాష్ కౌంటింగ్ యంత్రాలను సైతం అధికారులు గుర్తించారు.
నగదు 40 లక్షలు, రెండు కిలోల బంగారం
ప్రస్తుతం శివబాలకృష్ణ హెచ్ఎండీఏ పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ తో పాటు మెట్రో రైల్ ప్లానింగ్ అధికారి, రెరాలో కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లెక్కిస్తున్న కొద్దీ నోట్ల కట్టలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.40లక్షల నగదు, రెండు కిలోల బంగారం, 60 ఖరీదైన వాచ్ లు, 14 విలువైన మొబైల్ ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు గుర్తించారు. దీంతో పాటు స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు లాకర్లు, బంధువుల ఇళ్లలో సోదాలు ముగిసిన తర్వాత ఆస్తుల వివరాలను చెబుతామని అధికారులు తెలిపారు. రాజకీయ నేతల అండదండలతో పాటు ఉన్నతాధికారుల సహాకారంతోనే కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. కొనసాగిస్తోంది.