అన్వేషించండి

పార్కిన్సన్స్ లాంటి వ్యాధికి కిమ్స్‌లో రోబోటిక్‌ ఆపరేషన్, పదిహేను రోజుల్లో కోలుకున్న యువకుడు

కిమ్స్‌లో తొలిసారిగా ఆటోగైడ్ ప‌ద్ధ‌తిలో కృత్రిమ మేధ‌స్సును ఉపయోగించి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేష‌న్ శ‌స్త్రచికిత్స‌ చేశారు. ఇదో విప్లవామత్మకైన ప్రక్రియగా వైద్యులు చెబుతున్నారు.

కిమ్స్‌లో ప్రపంచంలోనే తొలిసారిగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేష‌న్ (డీబీఎస్) శ‌స్త్రచికిత్స‌ను ఆటోగైడ్ పద్ధతిలో నిర్వహించారు. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడుకు సోకిన ఇతర వ్యాధుల చికిత్సలో విప్లవాత్మకమైన చికిత్సగా వైద్యులు చెతున్నారు. 

సికింద్రాబాద్‌లోని కిమ్స్  న్యూరోసర్జరీ హెడ్‌ డాక్టర్ మానస్ పాణిగ్రాహి టీం ఈ విజయవంతమైన ఆపరేషన్ చేసింది. ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి కాంప్లికేటెడ్‌ ఆపరేషన్‌ చేయడంలో విజయవంతమయ్యారు. హైదరాబాద్‌కు  చెందిన 32 ఏళ్ల అభిన‌య్ ఓ విచిత్రమై వ్యాధి బారిన పడ్డాడు. చేతులు, కాళ్లు బిగుసుకుపోయి, పార్కిన్సన్స్ వ్యాధిలో ఉన్న‌ట్లే బిహేవ్ చేసేవాడు. న‌డ‌వ‌డం కూడా క‌ష్టంగా మారింది. అతనికి లేటెస్ట్‌ టెక్నాలజీ విధానాలతో మార్చి 3న చికిత్స చేశారు.

‘‘దాదాపు ఆరేళ్ల క్రితం కుడిచేతిలో వ‌ణుకు రావ‌డాన్ని అభిన‌య్ కుమార్ గుర్తించారు. అది క్రమంగా బాగా పెరిగింది. దానివల్ల అతడు టీకప్పు కూడా చేత్తో పట్టుకోలేకపోయాడు. వ్యాధి పెరిగే కొద్దీ కనీసం నడిచే పరిస్థితి లేక.. ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది. అతడి మెదడులో ఉన్న సమస్యను సరిచేయడానికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఇందుకోసం పార్కిన్సన్స్ డిసీజ్, కదలికలకు సంబంధించిన ఇతర సమస్యల్లో అత్యంత నిపుణులైన న్యూరోసర్జన్లు, న్యూరాలజిస్టులతోపాటు రోబోటిక్ టూల్ కూడా ఒకటి ఉంది. దాని సాయంతో మెదడులో సమస్య ఉన్న ప్రాంతాన్ని చేరుకోవడం ద్వారా చికిత్స చేయగలిగాం’’ అన్నారు పాణీగ్రాహి. 

పార్కిన్సన్స్ లాంటి వ్యాధికి కిమ్స్‌లో రోబోటిక్‌ ఆపరేషన్, పదిహేను రోజుల్లో కోలుకున్న యువకుడు

ఈ శ‌స్త్రచికిత్స‌ను విజయవంతంగా పూర్తి చేయడంలో డాక్ట‌ర్ మాన‌స్ పాణిగ్రాహికి డాక్ట‌ర్ ధ‌నుంజ‌య్, డాక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ యాడా సాయపడ్డారు. ఇలాంటి సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌లు విజ‌య‌వంతంగా చేయ‌డానికి ఆసియాలో ఉన్న‌ అతికొద్ది కేంద్రాల్లో కిమ్స్ ఆస్ప‌త్రిలోని పార్కిన్స‌న్స్ సెంట‌ర్ ఒక‌టి అని వైద్యులు చెప్పారు ఇక్కడి వైద్యులు. 

కిమ్స్ ఆస్ప‌త్రిలో ఉన్న ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోటిక్ సిస్ట‌మ్ మూర్ఛ శ‌స్త్రచికిత్స‌, బ్రెయిన్ ట్యూమ‌ర్ బ‌యాప్సీ, పార్కిన్స‌న్స్ వ్యాధికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేష‌న్‌, క‌ద‌లిక‌ల స‌మ‌స్య‌లు కొన్ని మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు చికిత్స చేయ‌డంలో ఉప‌యుక్తంగా ఉంటుందని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. 

మెద‌డులో ల‌క్షిత ప్రాంతాన్ని చేరుకోడానికి క‌చ్చిత‌మైన పొజిష‌న్‌, మార్గాన్ని స్టెల్త్ ఆటోగైడ్ రోబో లెక్కిస్తుంది. న్యూరోస‌ర్జ‌న్లు చాలా చిన్న ఎల‌క్ట్రోడ్‌ల‌తో కూడిన అతి స‌న్న‌టి వైరును దాని మొన‌మీద పెడ‌తారు. అది అత్యంత త‌క్కువ క‌ణ‌జాలాల‌కు ఎల‌క్ట్రిక‌ల్ స్టిమ్యులేష‌న్ అందిస్తుంది. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేష‌న్ స‌రిగ్గా జ‌ర‌గాలంటే, అది క‌చ్చితంగా 0.8 నుంచి 1.2 మిల్లీమీట‌ర్ల ప్రాంతంలోనే చేయాల్సి ఉంటుంది. స్టెల్త్ ఆటోగైడ్ రోబోను ఉప‌యోగించ‌డం ద్వారా కిమ్స్ ఆస్ప‌త్రిలో చేసిన ఈ శ‌స్త్రచికిత్స‌లో 0.2 మిల్లీమీట‌ర్ల క‌చ్చిత‌త్వంతోనే చేయ‌గ‌లిగాం. ఆటోగైడ్ స‌మాచారం ప్ర‌కారం దేశంలోనే ఇంత క‌చ్చిత‌త్వంతో చేయ‌డం ఇదే మొద‌టిసారని అని పాణీగ్రాహి పేర్కొన్నారు. త‌ల‌వెంట్రుక మందంలోనే ఇది చేయ‌గ‌లిగామన్నారు. 

ఒక‌వేళ ఈ శ‌స్త్రచికిత్స‌ను మాన్యువ‌ల్ ప‌ద్ధ‌తిలో చేస్తే న్యూరోస‌ర్జ‌న్లు త‌మంత‌ట తామే కోఆర్డినేట్ల‌ను లెక్కించుకుని, త‌న సొంత చేతుల‌తో మెద‌డులో లీడ్స్ బిగించాల్సి వ‌స్తుంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఆటోగైడ్ రోబో ఉండ‌టంతో.. స‌ర్జ‌న్లు ఫీడ్ చేసిన స‌మాచారాన్ని బ‌ట్టి, కోఆర్డినేట్ల‌ను రోబో సిద్ధం చేస్తుంది. ఇచ్చిన సూచ‌న‌ల‌కు అనుగుణంగా అత్యంత క‌చ్చిత‌త్వంతో అది మొత్తం ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తుంది. 

శ‌స్త్రచికిత్స జ‌రిగిన త‌ర్వాత అభిన‌య్ కుమార్ పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు ఏం కావాల‌న్నా అది చేసుకోగ‌లుగుతున్నాడు. అభిన‌య్ కుమార్ మాట్లాడుతూ, “నాకు 2016లో చేతిలో వ‌ణుకు మొద‌లైంది. ఒక ప్రైవేటు ఉద్యోగం చేసేవాడిని. ఈ స‌మ‌స్య కార‌ణంగా ఉద్యోగం మానేయాల్సి వ‌చ్చింది. మొద‌ట్లో నేను వేర్వేరు వైద్యుల వ‌ద్ద‌కు వెళ్లి అలోప‌తి, హోమియోప‌తి, ఆయుర్వేద మందులు వాడాను. కానీ వేటితోనూ నాకు ఫ‌లితం క‌న‌ప‌డ‌లేదు. త‌ర్వాత గూగుల్‌లో సెర్చ్ చేసిన‌ప్పుడు కిమ్స్ ఆస్ప‌త్రిలోని డాక్ట‌ర్ మాన‌స్ పాణిగ్రాహి గురించి తెలిసింది. ఇది పార్కిన్స‌న్స్ వ్యాధి అని ఆయ‌న చెప్పారు. డీబీఎస్ చేసిన త‌ర్వాత వ‌ణుకు పూర్తిగా ఆగిపోయింది. త్వ‌ర‌లోనే నేను మ‌ళ్లీ ఉద్యోగం కూడా చేసుకుంటాను ” అని ఎంతో ఆనందంగా తెలిపారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget