YS Sharmila : కాసుల కక్కుర్తి కోసం ఎత్తిపోతలు, కరెంట్ బిల్లులు జనం నెత్తిన - వైఎస్ షర్మిల
YS Sharmila : ఇరిగేషన్ శాఖ కరెంట్ బిల్లుల భారాన్ని ప్రజల నెత్తిన మోపుతున్నారని తెలంగాణ సర్కార్ పై వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.
YS Sharmila : ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ధనం మాయమవుతోందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. విద్యుత్ లైన్ల లోపాలకు, కరెంట్ కొనుగోళ్ల అవకతవకలకు, డిస్కం తప్పిదాలకు, కేసీఆర్ సర్కార్ చెల్లించాల్సిన బకాయిలకు సామాన్య ప్రజలను బలిచేస్తారా? అంటూ మండిపడ్డారు. జనం నడ్డి విరిచి బిల్లులు రాబడుతారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలో పోశారని విమర్శించారు. ఇరిగేషన్ శాఖ 9 వేల కోట్ల కరెంట్ బిల్లులను ఇప్పుడు జనం నెత్తిన మోపుతున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ధనిక రాష్ట్రంలో ధనం మాయమైందన్నారు. బంగారు తెలంగాణలో బంగారం మాయమైందని ఆక్షేపించారు.
విద్యుత్ లైన్ల లోపాలకు.. కరెంట్ కొనుగోళ్ల అవకతవకలకు ..
— YS Sharmila (@realyssharmila) December 18, 2022
డిస్కం తప్పిదాలకు .. సర్కార్ చెల్లించాల్సిన బకాయిలకు ..
జనాన్ని బలిచేస్తారా? జనం నడ్డి విరిచి బిల్లులు రాబడుతారా?
కాళేశ్వరం పేరుతో ఎత్తిపోసిన నీళ్లను సముద్రంలో పోసి ..
9 వేల కరెంట్ బిల్లులను ఇప్పుడు జనం నెత్తిన
1/4
కాసుల కక్కుర్తి కోసం ఎత్తిపోతలు
"జనాలకు గాల్లో మేడలు కట్టి ఫాంహౌస్ కోటలు కట్టుకున్నారు. ఫాంహౌస్ పాలనకు మూల్యం చెల్లించాల్సింది తెలంగాణ ప్రజలా?. కరెంటు బిల్లులు కట్టాల్సిన ప్రభుత్వ శాఖల బకాయిలు 2014లో రూ.1302 కోట్లు. 2022 నాటికి రూ.20,841 కోట్లకు ఎందుకు పెరిగింది?. తప్పుడు విధానాలు దోచుకోవటమే తప్పించి ప్రజలకు మేలు చేసే సోయి లేని కేసీఆర్ స్వార్థ పాలనకు తెలంగాణ ప్రజల మీద పడనున్న భారం రూ.17వేల కోట్లు అని అంచనా. మీకు ఓటు వేసిన పాపానికి ప్రజలకు నెత్తిన ఇంత భారంమోపుతారా? కాసుల కక్కుర్తి కోసం ఎత్తిపోతల పేరుతో ఎత్తేసిన సొమ్ము ఒక పక్క... వాటి నిర్వహణ భారం తలకు మించడం ఇంకోపక్క. 2014లో ఇరిగేషన్ శాఖ విద్యుత్ బకాయిలు రూ.107 కోట్లు అయితే 2020 నాటికి రూ.9268 కోట్లకు పెరిగింది. మీ మోసం బద్ధలైంది. మీ ధన దాహం తెలంగాణ ప్రజలకు శాపమైంది" - వైఎస్ షర్మిల
పాలేరులో YSR తెలంగాణ పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. తెలంగాణలో వైయస్ఆర్ సంక్షేమ పాలనకు పాలేరే పునాది రాయి. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఇండ్లు, పింఛన్లు ఇచ్చే ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. రైతులు, మహిళలు, యువతను ఆర్థికంగా నిలబెట్టే సర్కారును స్థాపిస్తాం. pic.twitter.com/ovIdx4TKzh
— YS Sharmila (@realyssharmila) December 16, 2022
పాలేరులో వైఎస్ఆర్టీపీ కార్యాలయం
పాలేరులో వైఎస్ఆర్టీపీ పోటీ దాదాపు ఖాయమైంది. అక్కడ నుంచి షర్మిల అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు మరోసారి ప్రకటించారు. దీని కోసం గత కొన్ని రోజుల పార్టీ కార్యాలయానికి స్థలాన్ని పరిశీలించారు. ఎట్టకేలకు స్థలం దొరకడంతో నేడు అక్కడ పార్టీ కార్యాలయానికి సర్వమత ప్రార్థనలతో భూమి పూజ చేశారు. ఖమ్మం రూరల్ మండలం కరుణ గిరి చర్చ్ సమీపంలో పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టనున్నారు. వై.ఎస్.షర్మిల ఆదివారం ఉదయం 11.30 గంటలకు భూమి పూజ చేశారు. ఆ కార్యక్రమంలో షర్మిల తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.