TSRTC : నిరుద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, బస్ పాసులలో 20 శాతం రాయితీ
TSRTC Bus Pass : నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బస్ పాస్ లో 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది.
![TSRTC : నిరుద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, బస్ పాసులలో 20 శాతం రాయితీ Hyderabad TSRTC says 20 percent rebate to competitive exam prepared students bus pass TSRTC : నిరుద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, బస్ పాసులలో 20 శాతం రాయితీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/30/37ac30261299c90d21f678802a6f6dc1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TSRTC Bus Pass : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ, గ్రూప్ 1 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. అయితే రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థులకు సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్‌లపై 20 శాతం రాయికీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మూడు నెల లపాటు ఈ రాయితీ కొనసాగిస్తామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ బస్‌పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్లు ఆధార్ కార్డు జిరాక్స్, కోచింగ్ సెంటర్‌కు సంబంధించిన ఐడీ కార్డు జిరాక్స్, నిరుద్యోగ గుర్తింపు కార్డులలో ఏదొకటి పాస్ తీసుకునే సమయంలో సబ్మిట్ చేయాలని తెలిపారు.
Please be noted that our #TSRTC call center numbers are changed. Here on Please share your valuable feedback, suggestions on our new @TSRTCHQ call centre numbers 040- 69440000, 040-23450033 @TV9Telugu @sakshinews @Fukkard @baraju_SuperHit @TarakSpace @V6News #TSRTCCallCenter pic.twitter.com/ejeEQjLMBX
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 30, 2022
20 శాతం రాయితీ
టీఎస్ఆర్టీసీ మూడు నెలలకు ఆర్డినరీ బస్ పాస్ కోసం రూ.3,450 చెల్లించాలి. తాజా రాయితీతో ఈ ఛార్జీ రౌండప్ చేసి రూ.2,800గా నిర్ణయించారు. అలాగే మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ కు ప్రస్తుతం రూ.3,900 వసూలు చేస్తున్నారు. 20 శాతం రాయితీతో రౌండప్ చేసి రూ.3,200 వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ నూతన కాల్ సెంటర్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. 040-23450033, 040-69440000 నంబర్‌కు ఫోన్ చేసి ఆర్టీసీ సర్వీసుల వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది. కాల్ సెంటర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ప్రయాణికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. రిజర్వేషన్, బస్సుల వివరాలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని టీఎస్ఆర్టీసీ తెలిపింది.
TSRTC is happy to announce 2 new bus passes for the unemployed youth attending training classes for competitive exams in #Telangana with a discount of 20%. #TSRTC wishes you all the very best and bright future ahead @TSRTCHQ @baraju_SuperHit @TV9Telugu @sakshinews#TSRTCNewPass pic.twitter.com/DQUfiRmlpl
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) April 30, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)