అన్వేషించండి

TS Assembly Session : తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు, ఎనిమిది కీలక బిల్లులకు శాసనసభ ఆమోదం

TS Assembly Session : తెలంగాణ శాసనసభలో ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపింది.

TS Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ శాసనసభలో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపింది. మోటార్ వెహికల్‌ పన్నుల చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్ట సవరణ బిల్లు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లు,   పారిశ్రామిక చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సూపరెన్యుయేషన్ సవరణ బిల్లులను శాసససభలో ప్రవేశపెట్టారు. వీటికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.  ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణకు శాసనసభ ఆమోదంతో కావేరి, గురునానక్, శ్రీనిధి, ఎంఎన్ఆర్, నిక్‌మార్ యూనివర్సిటీలకు అనుమతి లభించింది.  

తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు 

ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లుతో ఏర్పడే కొత్త వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు అమలుచేయనున్నారు. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో 12 వర్సిటీలకు ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు చేసినట్లు అయింది. నియామకాల తర్వాత కూడా కోర్టు కేసులు వస్తున్నాయని, కోర్టు తీర్పుల వల్ల వర్సిటీల్లో ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. యూజీసీ నిబంధనలతో ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేశామని తెలిపారు. ఉమ్మడి నియామక బోర్డు ఛైర్మన్ గా ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఉంటారని, వైస్ ఛాన్స్ లర్లు కమిటీ ఛైర్మన్లుగా ఉంటారన్నారు. యునివర్సిటీల్లో మూడు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు.  శాసనసభలో మోటార్ వెహికల్‌ పన్నుల చట్ట సవరణ బిల్లుపై మంత్రి పువ్వాడ అజయ్‌ మాట్లాడారు. వాహనాల అమ్మకాల్లో ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు వచ్చేలా చట్ట సవరణ చేశామని తెలిపారు. డీలర్ల రాయితీ నిలువరించేందుకు చట్టాన్ని సవరణ చేశామన్నారు. లారీల అంతర్రాష్ట్ర పన్నులపై ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు. గ్రీన్‌ ట్యాక్స్‌ అనేది కేంద్రప్రభుత్వం తెచ్చిందన్నారు. ఈ చట్ట సవరణ వల్ల వినియోగదారులకు పెద్దగా ఇబ్బంది ఉండదన్నారు.  

నేటితో ముగియనున్న సమావేశాలు 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల విరామం తర్వాత తిరిగి నిన్న ప్రారంభం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుపై సీఎం కేసీఆర్ సభలో మాట్లాడారు. శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు నేటితో(మంగళవారం) ముగుస్తాయి. ఇవాళ అసెంబ్లీలో కీలక బిల్లులపై చర్చించి ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.  కేంద్ర విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నామని సభ తీర్మానం చేసింది. అలాగే దిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాటిపై చర్చించి ఆమోదం తెలిపనున్నారు.  అలాగే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమలులో కేంద్ర వైఖరి, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులో కేంద్ర వైఫల్యంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ములుగు వద్ద ఉన్న అటవీ కళాశాలను యూనివర్శిటీగా మార్చేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. దీనపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

Also Read : VRAs Protest : వీఆర్ఏ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ భేటీ, సమ్మె తాత్కాలిక వాయిదా!

 Also Read : Telangana Assembly: కదం తొక్కిన వీఆర్ఏలు, అసెంబ్లీ ముట్టడికి యత్నం - భారీ లాఠీచార్జి, ఉద్రిక్తత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget