News
News
X

Revanth Reddy : మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరిండు - రేవంత్ రెడ్డి

Revanth Reddy : బీజేపీ, టీఆర్ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలకు ఓట్లు అడిగే హక్కులేదన్నారు.

FOLLOW US: 

Revanth Reddy : మునుగోడు ప్రజలను మోసం చేయడానికి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మరోసారి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలు, వివాదాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క వాగ్దానం నెరవేర్చలేదని విమర్శించారు. నల్లధనం విదేశాల నుంచి తెచ్చి ప్రతి పౌరుడు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తా అన్నారని, ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారన్నారు. 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని కానీ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. 

వ్యక్తిగత విమర్శలు వద్దు 

"మోదీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా, నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్నా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదు. ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిన కూడా ధరలను నియంత్రించి పేదలను ఆదుకోలేదు. తెలంగాణలో టీఆర్ఎస్  డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీలు ఇచ్చింది. ఏ ఒక్కహామీ పూర్తిచేయలేదు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా సమస్యల ప్రాతిపదికన జరగాల్సిన చర్చ వ్యక్తిగత విమర్శలు దారి తీస్తుంది." - రేవంత్ రెడ్డి 

టీఆర్ఎస్ హామీలు ఏమైయ్యాయి?

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని కేంద్రాన్ని తాను పార్లమెంట్ లో ప్రశ్నిస్తే 22  కోట్ల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 7 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయిస్తే అక్కడి సమస్యలు తీరుతాయన్నారు. మునుగోడు ప్రజలను మోసం చేయడానికి సీఎం కేసీఆర్ బయలుదేరారన్నారు. డబుల్ బెడ్ రూమ్, ఇంటికో ఉద్యోగం ఏ ఒక్క హామీ కేసీఆర్  నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ప్రజల పక్షాన టీఆర్ఎస్, బీజేపీను  ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కి ఉందన్నారు. ప్రశ్నించే గొంతుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడిందన్నారు. కాంగ్రెస్ పక్షాన ప్రజలు ఉన్నారన్నారు. సమస్యల పై చర్చ జరగాలి వ్యక్తిగత విమర్శలు కాదని రేవంత్ అన్నారు.  

కమ్యూనిస్టులు, కోదండరాంను కలుపుకుని 

పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ , ట్రిపుల్ ఐటీ, జాతీయ హోదా సాగునీటి ప్రాజెక్టులు, గిరిజన యూనివర్సిటీల గురించి టీఆర్ఎస్ ఎందుకు చెయ్యడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ శ్రేణులు పోరాటం చేయాలన్నారు. బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.  కమ్యూనిస్టులు, కోదండరాంను కలుపుకుని పోరాడదామన్నారు. సమన్వయం చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై పోరాడాలని సూచించారు. మునుగోడు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ లకు బుద్ధి చెపుదామని రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  

Also Read : Bandi Sanjay: ఈడీని వాడితే ఒక్కరూ మిగలరు, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు - గన్‌ ఫైరింగ్‌పై కూడా

Also Read : Raghunandan Rao: మంత్రి తుపాకీ ఫైరింగ్: గన్‌లో రబ్బరు బుల్లెట్లా? SPనీ నిందితుడిగా చేర్చాల్సిందే - బీజేపీ ఎమ్మెల్యే

Published at : 14 Aug 2022 02:23 PM (IST) Tags: BJP cm kcr revanth reddy TS News Hyderabad News Munugodu Bypoll

సంబంధిత కథనాలు

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

చైన్‌ లాగుతూ దొరికిన కానిస్టేబుల్- స్థానికులు బాదుడే బాదుడు!

చైన్‌ లాగుతూ దొరికిన కానిస్టేబుల్- స్థానికులు బాదుడే బాదుడు!

Breaking News Live Telugu Updates: తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

Breaking News Live Telugu Updates: తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

Priyanka Batukamma : బతుకమ్మతో ఇందిరాగాంధీ - ప్రియాంకా గాంధీ తెలుగు ఏం చెప్పారంటే ?

Priyanka Batukamma :  బతుకమ్మతో ఇందిరాగాంధీ - ప్రియాంకా గాంధీ తెలుగు ఏం చెప్పారంటే ?

గురువుగారూ అంటూ గుండెల్లో గునపం దింపారు- స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల కోసం కిల్లర్ ప్లాన్

గురువుగారూ అంటూ గుండెల్లో గునపం దింపారు- స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడుల కోసం కిల్లర్ ప్లాన్

టాప్ స్టోరీస్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?

Arvind Swamy: చైతు సినిమాలో అరవింద్ స్వామి - విలన్‌గా మెప్పిస్తారా?