By: ABP Desam | Updated at : 31 Jan 2022 10:10 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
మేడారం జాతరకు భక్తుల రవాణా సౌకర్యాలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖైరతాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో రవాణా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి భేటీ అయ్యారు. మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద జాతర కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడనుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌నుంచి మేడారానికి ప్రత్యేక బస్సు సర్వీసులు వచ్చే నెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయని, ఎంజీబీఎస్ నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.
ఎంజీబీఎస్ నుంచి బస్సులు
హైదరాబాద్ డిపో-1 సూపర్ లగ్జరీ బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతాయని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. మేడారం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి బయల్దేరుతాయని వెల్లడించారు. హైదరాబాద్ -2 డిపో బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు మేడారం నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరుతాయని చెప్పారు. పికెట్ డిపో బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 8 గంటలకు మేడారం నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతాయని తెలిపారు.ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ వెబ్ సైట్లో, టీఎస్ఆర్టీసీ యాప్‌లో బస్సులను బుక్ చేసుకునే వెసలుబాటు కల్పించామన్నారు. మేడారం ప్రత్యేక బస్సులకు రూ.398 ధర నిర్ణయించామన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీసీ ఛైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
మేడారంలో ప్రత్యేక ఏర్పాట్లు
భక్తుల రవాణా సదుపాయాల కోసం 3,845 బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. 51 ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు. మేడారంలో 50 ఎకరాల్లో బస్ స్టేషన్ నిర్మించారు. 41 క్యు లైనర్ ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు 42 సీసీ కెమెరాల సర్వెలెన్స్ కేంద్రం ఏర్పాటు చేశారు. 1500 మంది ప్రయాణికులు విశ్రాంతి, పడుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులందరికీ శానిటైజ్ చేస్తామని, మాస్క్ లు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. నార్లాపూర్ నుంచి జంపన్న వాగు వరకు 25 మినీ బస్సులు నిరంతరం నడపనున్నారు. మీడియా కవరేజ్ కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు, 20 రోజుల పాటు ప్రైవేట్ ఏసీ బస్సులు, ఇన్నోవా కార్లు రవాణా కోసం ఏర్పాటు చేయనున్నారు.
Breaking News Live Telugu Updates: ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు
TSRTC News: ఫలించిన సజ్జనార్ వ్యూహాలు - క్రమంగా గట్టెక్కుతున్న టీఎస్ఆర్టీసీ! ఈసారి భారీగా తగ్గిన నష్టం
Telangana Covid Cases: తెలంగాణలో మరింత పెరిగిన కరోనా, 3 వేలు దాటిన యాక్టివ్ కేసులు - 500కి చేరువలో కొత్తవి
Thunderstorm Safety Tips: వానాకాలం మొదలైంది, ప్రాణాలు పోతున్నాయి - పిడుగుపాటుకు గురికాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
Kollapur News: కొల్లాపూర్‌లో పరిస్థితి గరం గరం! ఇద్దరు TRS నేతల సవాళ్లు - హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్
India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్ ఎవరు?
AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?