AP Telangana Breaking Live: ఏపీలో కొత్తగా 1435 కరోనా కేసులు, 6 మరణాలు
ఏపీలో గడిచిన 24 గంటల్లో 1435 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. 69,173 నిర్థారణ పరీక్షలు చేశారు. ఇందులో 1435 మంది కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

Background
సూర్యాపేట పట్టణంలో కేంద్ర మంత్రి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమైంది. ఇవాళ (ఆగస్టు 20) ఉమ్మడి వరంగల్ జిల్లాలోకి ఆయన యాత్ర ప్రవేశించనుంది. గతేడాది చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీర ణరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి జి.కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఎంపికైన చింతలచెరువుకు చెందిన మెరుగు మారతమ్మ నివాసంలో కిషన్ రెడ్డి అల్పాహారం తీసుకొనున్నారు. కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర.. తొలి రోజు విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలిరోజు కోదాడ, సూర్యాపేటలో సాగిన యాత్రలో కేంద్ర సంక్షేమ పథకాలను కిషన్ రెడ్డి ప్రజలకు వివరించారు. కేసీఆర్ సర్కారుపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తొలిరోజు యాత్రను ముగించుకున్న కిషన్‌రెడ్డి సూర్యాపేటలోనే బస చేశారు.
Also Read: Hyderabad: ఇంట్లోకి చొరబడి దొంగతనం.. కానీ మంచోడట! అవాక్కైన బాధితుడు.. ఎలాగంటే..
ఏపీలో కొత్తగా 1435 కరోనా కేసులు, 6 మరణాలు
ఏపీలో గడిచిన 24 గంటల్లో 1435 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. 69,173 నిర్థారణ పరీక్షలు చేశారు. ఇందులో 1435 మంది కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ వల్ల చిత్తూరు ఇద్దరు, కృష్ణలో ఇద్దరు ప్రకాశంలో ఇద్దరు మరణించారు. గడచిన 24 గంటల్లో 1,695 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,59,72,539 సాంపిల్స్ పరీక్షించారు.
ఏపీలో రాత్రి కర్ఫ్యూ మళ్లీ పొడిగింపు....
ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగించారు. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 4 తేదీ వరకూ రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అయితే కర్ఫ్యూ సమయంలో మరో గంట సడలింపు ఇచ్చినట్టు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.





















