By: ABP Desam | Updated at : 28 Apr 2022 06:09 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
హైదరాబాద్ లో వర్షం
Hyderabad Rains : హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. దీంతో పాటు నగరంలోని మాదాపూర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, లంగర్ హౌస్, కార్వాన్, గోల్కొండ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, కవాడిగూడ, విద్యానగర్, బోలక్‌పూర్, గాంధీనగర్ ప్రాంతాల్లో మోస్తరు వాన కురిసింది. సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. బీఆర్కే భవన్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, బేగంబజార్, ఏంజె మార్కెట్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, హిమాయత్ నగర్, నారాయణగూడ, లిబర్టీ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. నగరంలో ఈదురుగాలులతో వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భానుడి ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులకు వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) April 28, 2022
తేలికపాటి నుంచి మోస్తరు వర్షం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయిందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. నగరంలో గరిష్టంగా 40 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. పశ్చిమదిశ ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 10-14 కి.మీ వేగంగా వీస్తాయని తెలిపింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అకాల వర్షం కారణంగా వరి తడిసిముద్దైంది. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. వరి కోతలు, ధాన్యం ఆరబెడుతున్న సమయంలో అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులకు చెట్టు కూలి నాలుగు ద్విచక్ర వాహనాలపై పడింది. అకాల వర్షంతో పట్టణవాసులకు కాస్త ఉపశమనం ఉంటే రైతులకు మాత్రం కష్టాలు తెచ్చిపెట్టింది.
Heavy Rain Now in Jeedimetla with Gusty winds⛈️
— Hyderabad Rains (@Hyderabadrains) April 28, 2022
Enjoying Cool Weather 😀❤️#Hyderabadrains @balaji25_t @TS_AP_Weather @Rajani_Weather @HYDmeterologist pic.twitter.com/H6hlCW3JHS
వడగండ్ల వాన
హైదరాబాద్‌లోని ఉప్పల్, అంబర్‌పేట, ఉస్మానియా యూనివర్సిటీ, రాంనగర్, ముసారాంబాగ్, మలక్‌పేట్, రామంతాపూర్, దిల్‌సుఖ్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, శివరాంపల్లి, బంజారాహిల్స్, మాసాబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, అత్తాపూర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. పలు పాంత్రాల్లో వడగండ్ల వాన కురిసింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో రాబోయే గంటలో పిడుగులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Hail Strom In #Kompally ⛈️🧊#Hyderabadrains https://t.co/vxam4nHcwb
— Hyderabad Rains (@Hyderabadrains) April 28, 2022
Petrol-Diesel Price, 23 May: శుభవార్త! నేడూ తగ్గిన ఇంధన ధరలు, ఈ ఒక్క నగరంలోనే పెరుగుదల
Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా
TS SSC Exams : రేపటి నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు, ఐదు నిమిషాల నిబంధన వర్తింపు
Breaking News Live Updates: కర్నూలు జిల్లాలో విషాదం, పెళ్లి మండపంలో వరుడు హఠాన్మరణం
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Horoscope Today 23 May 2022: ఈ రాశివారు ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించకపోవడమే మంచిది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్