Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, ఈ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Hyderabad Rains : హైదరాబాద్ పై వరుణుడు విరుచుపడ్డారు. ఆగకుండా రెండు గంటలకు పైగా జడివాడ కురిపించాడు. దీంతో ప్రధాన రహదారులు నీట మునిగాయి. పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, కిస్మత్‌పురా, మెహదీపట్నం, జియాగూడా తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, బోలక్పూర్, కవాడీగూడ, గాంధీనగర్, జవహర్ నగర్, రామ్‌నగర్, దోమలగూడ, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, కోఠి వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
Mallepally Wonderla, Hyderabad. #HyderabadRains @HiHyderabad pic.twitter.com/Qf3Vz0YOYJ
— Mirza Kareem Baig (@MirzaKareemB) September 26, 2022
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) September 26, 2022
IMPORTANT TRAFFIC ALERT#Rainfall #HyderabadRains #heavyrain @JtCPTrfHyd pic.twitter.com/c5b9NM6Tlj
ఈ మార్గాల్లో ట్రాఫిక్ జామ్
నల్గొండ ఎక్స్ రోడ్స్, మలక్ పేట్ రైల్వే స్టేషన్, అజంపురా నుంచి చాదర్‌ఘాట్ రోటరీ వైపు ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. వాహనదారులు ఇళ్లకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పంజాగుట్ట, బేగంపేట్, GVK మాల్, తాజ్ కృష్ణ, రోడ్ నెం. 1/10, రోడ్ నెం. 1/12, ఖాజా మాన్షన్, మాసబ్ ట్యాంక్ X రోడ్ల నుంచి ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతుంది. లక్డీకా పూల్ వద్ద రోడ్లపై నీరు చేరడంతో పబ్లిక్ గార్డెన్, గన్‌ఫౌండ్రీ, DGP ఆఫీస్, లక్డీకాపూల్ నుంచి సైఫాబాద్ పీఎస్ వైపు ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. పీవీఆర్ ఎక్స్ ప్రెస్ మార్గంలో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
#Attapur #Hyderabad #HyderabadRains @balaji25_t pic.twitter.com/8sw3eri2fj
— Imran Khan عمران خان (@iquadri51) September 26, 2022
హైదరాబాద్ వర్షాలు - 2 గం.లో మి.మీ
- నాంపల్లి -92.5
- LB స్టేడియం -86.5
- మెహిదీపట్నం -83.5
- ఖైరతాబాద్ -75.8
- అల్కాపురి- 72.3
- అత్తాపూర్ -64.3
- హిమాయత్‌నగర్ -63.5
- జియాగూడ -62.5
- మలక్‌పేట -61.5
- ఆసిఫ్‌నగర్ -52.5
- సికింద్రాబాద్ -44.5
- రాజేంద్రనగర్ -43.5
- సరూర్‌నగర్ -43.5
- షేక్‌పేట -41.3
- అంబర్‌పేట్ -37.3
#HeavyRain in #Hyderabad, We request the public to #StayAway from Old, Electric Poles/ Trees/Hoardings #Dilapidated Buildings/Structures and Walls.#Dial100 or 9490617111 in case of #emergency.#HyderabadRains #StayAlert@TelanganaDGP @TelanganaCOPs pic.twitter.com/bI3JwTSsTZ
— Rachakonda Police (@RachakondaCop) September 26, 2022