అన్వేషించండి

Pawan Kalyan : నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్, నా ఓటమిని ఒప్పుకుంటాను - పవన్ కల్యాణ్

Pawan Kalyan : పవన్ కల్యాణ్ తన రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తానొక పరాజయ రాజకీయ నేత అన్నారు.

Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్ శిల్పాకళా వేదికలో  సీఏ విద్యార్థులకు సంబంధించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఫేసింగ్‌ ది ప్యూచర్' అనే అంశంపై సీఏ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.  ఈ సదస్సులో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానొక పరాజయ రాజకీయ నేతను అన్నారు. 

డబ్బున్న వాళ్లంతా గొప్పోళ్లు అనుకోవద్దు

"నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్. నా ఓటమిని నేను ఒప్పుకుంటాను. ఓటమి విజయానికి దగ్గర చేస్తుంది. అందుకే నా ఓటమిని ఒప్పుకుంటాను. వైఫల్యాల గురించి నేనెప్పుడూ చింతించను. ఎందుకంటే నేను ఏదొకటి సాధించాను. చాలా మంది సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటారు. కానీ ప్రయత్నించరు. నేను వాళ్లలా కాదు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను.డబ్బున్న వాళ్లంతా గొప్పవాళ్లు, పేరున్న వాళ్లంతా మహానుభావులు అనుకోవద్దు. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మకండి. దేవుడిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది మనమే నిర్ణయించుకోవాలి. మన వ్యక్తిగత విజయమే మన దేశానికి పెట్టుబడి" - పవన్ కల్యాణ్   

విజయం కూడా తాత్కాలికమే

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ జీవితంపై ఊహించని వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో విఫలమయ్యానన్నారు. అయితే ఓటమి  తన విజయానికి పునాదులు వేస్తాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో సీఏ విద్యార్థుల సదస్సులో పాల్గొన్న ఆయన...తన రాజకీయ జీవితంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను విఫల రాజకీయ నాయకుడినని అన్నారు. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లింది. అక్కడున్న విద్యార్థులు.. 'నో ... నో ' అని గట్టిగా కేకలు వేశారు. సీఎం ..సీఎం అంటూ నినాదాలు చేశారు.  పరాజయం ఎలాగైతే తాత్కాలికమైనదో విజయం కూడా తాత్కాలికమే అన్నారు. విజయాన్ని నెత్తికెక్కించుకోవద్దని విద్యార్థులకు సూచించారు. రాజకీయాలల్లో ఇప్పటి వరకైతే నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్‌ అన్నారు. దానిని అంగీకరిస్తానన్నారు. అందుకు తాను బాధపడనని, ఎందుకంటే ఓటమి విజయానికి సగం బాట వేస్తుందన్నారు. వైఫల్యాలను కూడా సానుకూల దృక్పథంతో చూస్తానన్నారు. సమాజంలో మార్పు కావాలని కోరుకునే చాలా మంది ఏం చేయడం లేదని, కానీ నేను అలా కాదన్నారు. తన ప్రయత్నంతో ఎంతో కొంత సాధించానన్నారు.  

రెండు స్థానాల్లో ఓడినా? 

2014లో జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కల్యాణ్ అప్పుటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన మద్దతు తెలిపింది.  ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధించింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి స్వస్తి చెప్పిన పవన్ వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. జనసేన పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేగా గెలవగా, పోటీ చేసిన రెండు స్థానాల్లో పవన్ ఓటమిపాలయ్యారు. ఎన్ని ఓటములు ఎదురైనా ప్రజల కోసం తన జీవితంలో 25 సంవత్సరాలు కేటాయించానని పవన్ చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తుంది. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిస్తూ తరచూ పవన్ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. 

 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
China Earthquake: చైనాలో 7.9 తీవ్రతతో భూకంపం- ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
చైనాలో 7.9 తీవ్రతతో భూకంపం- ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
Earthquake Videos: గుండెను గట్టిగా పట్టుకొని ఈ వీడియోలు చూడండి- మయన్మార్, బ్యాంకాక్‌లో వచ్చిన భూకంప తీవ్ర తెలుస్తుంది
గుండెను గట్టిగా పట్టుకొని ఈ వీడియోలు చూడండి- మయన్మార్, బ్యాంకాక్‌లో వచ్చిన భూకంప తీవ్ర తెలుస్తుంది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
China Earthquake: చైనాలో 7.9 తీవ్రతతో భూకంపం- ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
చైనాలో 7.9 తీవ్రతతో భూకంపం- ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
Earthquake Videos: గుండెను గట్టిగా పట్టుకొని ఈ వీడియోలు చూడండి- మయన్మార్, బ్యాంకాక్‌లో వచ్చిన భూకంప తీవ్ర తెలుస్తుంది
గుండెను గట్టిగా పట్టుకొని ఈ వీడియోలు చూడండి- మయన్మార్, బ్యాంకాక్‌లో వచ్చిన భూకంప తీవ్ర తెలుస్తుంది
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
Embed widget