Hyderabad: ఇచ్చట పని మనుషులు, డ్రైవర్లు, డెలీవరి బాయ్స్ లిఫ్ట్ ఎక్కకూడదు.. ఎక్కినచో ఫైన్ కట్టాల్సిందే
లిఫ్ట్ ఎక్కితే డబ్బులు.. అడగడం చూశారా? ఇదేం ప్రశ్న అనుకోకండి.. ఓ ప్లేస్ లో లిఫ్ట్ ఎక్కితే.. కచ్చితంగా.. డబ్బులు ఇవ్వాల్సిందేనట. అది కూడా కొంతమందికే.
అక్కడ లిఫ్ట్.. ఎక్కితే.. డబ్బులు కట్టాలి. అదేంటి అనుకోకండి.. అక్కడ రూల్ అలా పెట్టారు మరీ. ఎక్కడో కాదు అది హైదరాబాద్ లోనే. హైదరాబాద్ హౌసింగ్ సొసైటీ మెయిన్ లిఫ్ట్ ఉపయోగించే.. పనిమనిషి, డెలివరీ బాయ్స్ కి రూ.300 జరిమానా విధిస్తామని బోర్డు పెట్టారు. ఈ విషయం.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌లోని హౌసింగ్ సొసైటీ మెయిన్ లిఫ్ట్‌లను ఉపయోగించవద్దని.. లేకుంటే రూ.300 జరిమానా విధిస్తామని నోటీసు అంటించి ఉంది. పని మనుషులు, డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఎక్కితే.. జరిమానా ఉంటుందని.. నోటీసు పెట్టడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Cyberabad, 2022. pic.twitter.com/4XrldTlEel
— Harsha Vadlamani (@Hrsha) January 12, 2022
There are people justifying this!
— Deepak Shenoy (@deepakshenoy) January 13, 2022
The RWA needs to be warned, and this taken down. The obvious racism/casteism/classism in this is disgusting https://t.co/0FJcZ7km7l
.@AAP_TS .@AAPTELANGANA .@Aapindirashoban .@AapHyderabad plz find all such buildings and request the residents to remove such discriminatory and racist notices removed. If they want support staff then they must be treated at par. https://t.co/dY0MVqPMje
— Adv. Somnath Bharti: इंसानियत से बड़ा कुछ नहीं! (@attorneybharti) January 12, 2022
భారత్ లో వివక్ష కొత్తేమీ కాదు. అయితే మరో కొత్త రకం వివక్ష కనపడటంతో జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. దురదృష్టవశాత్తూ.. ఇంటి పనులు, డెలివరీ బాయ్స్.. వివక్షకు గురవుతున్న ఉదాహరణాలు ఉన్నాయి. అయితే లిఫ్ట్ విషయంలోనూ వారిపై వివక్ష చూపించడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ట్విట్టర్ లో ఓ జర్నలిస్టు దీనికి సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.