అన్వేషించండి

Revanth Reddy On Undavalli : కేసీఆర్ హనీ ట్రాప్ లో ఉండవల్లి, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy On KCR Undavalli Meet : కేసీఆర్ హనీ ట్రాప్ లో ఉండవల్లి పడ్డారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ చేయడంలేదో ఉండవల్లికి తెలియదా అని ప్రశ్నించారు.

Revanth Reddy On KCR Undavalli Meet : కేంద్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈడీ విచారణకు నిరసనగా రెండో రోజు కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు బైఠాయించాయి. ఈ నిరసన కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి...దేశ స్వాతంత్ర్యం కోసం నేషనల్ హెరాల్డ్ పత్రికను 1937లో నెహ్రూ ప్రారంభించారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం అనంతరం అప్పుల కారణం ఆ పత్రిక మూతపడిందని తెలిపారు. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ భావాజాలాన్ని తిప్పికొట్టడానికి నేషనల్ హెరాల్డ్ పేపర్ కు కాంగ్రెస్ ఊపిరి పోసి మళ్లీ ప్రారంభించింది. లాభాపేక్ష లేని యంగ్ ఇండియా సంస్థలు ప్రభుత్వం నుంచి లబ్ది పొందలేదన్నారు. బీజేపీ దుర్మార్గాలు నేషనల్ హెరాల్డ్ పేపర్ బయటపెడుతుందనే కారణంతోనే బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందన్నారు. గతంలో సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్లినా మనీ లాండరింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చిందన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తులలో ఎలాంటి అవినీతి జరగలేదని రేవంత్ స్పష్టం చేశారు. 

బీజేపీకి భయం పట్టుకుంది

" కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయం బీజేపీలో మొదలైంది. అందుకే మూసేసిన కేసులో నోటీసులు ఇచ్చారు. 5 గంటల వరకే విచారణ ముగించాలి. కానీ ఈడీ ఆఫీస్ లో రాహుల్ గాంధీని 12 గంటల పాటు కూర్చోబెట్టారు. ఇది మోదీ ప్రభుత్వానికి తగునా.. ఓ ఎంపీని, ఓ పార్టీ అధ్యక్షుడిని ఇన్ని గంటలు ఎందుకు విచారణ చేయాలి. తల్లి హాస్పిటల్ లో ఉంటే కొడుకును గంటల కొద్ది విచారణ పేరుతో ఉంచారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఇంత బరితెగింపు మంచిది కాదు.  ఈ దేశ భవిష్యత్ కోసం తన రక్తాన్ని దారపోయడానికి సిద్ధమని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి ఇంతకు ఇంతా మిత్తితో సహా చెల్లిస్తాం. అధికారం శాశ్వతం కాదు. అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ నేతలు చెప్పినట్లు వింటే.. రేపు అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. "
-- రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షుడు
 

300 సీట్లతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. తక్షణమే ఈడీ కేసును ఉపసంహరించుకొని బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ తీరు మారకుంటే.. ఈ నెల 23న దిల్లీలో ఉన్న ఈడీ ఆఫీస్ ను తెలంగాణ బిడ్డలు ముట్టడిస్తారన్నారు. 

ఉండవల్లి-కేసీఆర్ భేటి పై రేవంత్ రెడ్డి 

సీఎం కేసీఆర్ హనీ ట్రాప్ లో ఉండవల్లి పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర సిద్ధాంతం కోసం పోరాడారనే గౌరవం ఆయనపై ఉండేదన్నారు. కేసీఆర్ ఇంట్లోకి పిలిచి ఉండవల్లికి ఏం చెప్పారో గానీ, కేసీఆర్ పంచన చేరి, ఉండవల్లి కేసీఆర్ భజన చేయడంతో తెలంగాణ ప్రజల్లో ఆయనకు ఉన్న గౌరవం పోయిందన్నారు. కేసీఆర్ బీజేపీపై పోరాడితే, కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణ జరిపించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంత చిన్న లాజిక్ ఉండవల్లి ఎలా మిస్ అయ్యారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై ఉండవల్లి రెండు పుస్తకాలు రాశారన్న రేవంత్ రెడ్డి.. ఆ రెండు పుస్తకాలలో తెలంగాణ ఏర్పాటునే తప్పు బట్టారని గుర్తుచేశారు. తెలంగాణ కోసం పోరాడిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ను ఉండవల్లి విమర్శించారన్నారు. అలాంటి వ్యక్తిని కేసీఆర్ ఇంటికి పిలిచి కలిసి పనిచేయమంటరా అని నిలదీశారు. సార పాతదే సీత కొత్తది అన్నట్లు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తారట అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్లాంతా.. బీహార్ వాళ్లే అని ఆరోపించారు.  అది టీఆర్ఎస్ కాదని అది బీహార్ రాష్ట్ర సమితి అని విమర్శించారు. ఉండవల్లి అడ్డా మీద కూలిగా మారి కేసీఆర్ తో కలవద్దు అని సూచించారు.  తెలంగాణను వ్యతిరేకించిన ఉండవల్లిని కేసీఆర్ దగ్గరకు తీస్తే తెలంగాణ సమాజం ఊరుకోదన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet Decisions 2026: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు - ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్.. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు - ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్.. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్!
Argentina vs Spain World Cup Final Hyderabad: ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
ఫుట్ బాల్ ప్రపంచకప్ ఫైనల్ ఎంజాయ్ చేయాల్సిందే - రాత్రంతా పబ్బులు, హోటళ్లకు తెలంగాణ సర్కార్ అనుమతి !
Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
Cement Corporation of India: ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!
ఆదిలాబాద్‌లో సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై జోగు రామన్న అల్టిమేటం - ఆగస్టు 31లోగా తేల్చకపోతే ఆమరణ నిరాహార దీక్ష!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget