అన్వేషించండి

CM KCR : వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయాను- సీఎం కేసీఆర్

CM KCR : సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. మహేశ్ బాబు, కృష్ణ కుటుంబ సభ్యులకు సీఎం ధైర్యం చెప్పారు.

CM KCR  : సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణ భౌతిక కాయాన్ని హైదరాబాద్ నానక్ రాంగూడలోని ఆయన నివాసానికి తరలించారు. కృష్ణ భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. నానక్‌రాంగూడలోని కృష్ణ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. మహేష్ బాబు, కృష్ణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ సంతోష్ కుమార్ కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ సినీనటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కృష్ణ అని కేసీఆర్ అన్నారు. కృష్ణ ఎంపీగా కూడా పనిచేశారని గుర్తుచేశారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను చాలా సార్లు చూశానన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

CM KCR  :  వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయాను- సీఎం కేసీఆర్

మంచి మిత్రుడిని కోల్పోయా

"తెలుగు చలన చిత్ర పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. నేను వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయాను. ఆయన ఆహ్వానం మేరకు ఇక్కడకు చాలాసార్లు వచ్చాను. ఆయన చాలా ముక్కు సూటిగా మాట్లాడే మనిషి. పార్లమెంట్ సభ్యునిగా పనిచేసి దేశానికి సేవ చేశారు. అల్లూరి సీతారామరాజు సినిమాను నేను చాలా సార్లు చూశాను. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కృష్ణ గారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశాం. ఈ దుఃఖాన్ని భరించగల ధైర్యాన్ని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను" - సీఎం కేసీఆర్ 

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు 

మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు సీఎం సూచించారు. కేసీఆర్ ఆదేశంతో పోలీసుల అధికారిక వందనంతో కృష్ణకు తుది వీడ్కోలు పలకనున్నారు. అంతకు ముందు కేసీఆర్ కృష్ణ మృతి వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారని అన్నారు.  నాటి కార్మిక కర్షక లోకం కృష్ణను తమ అభిమాన హీరో గా, సూపర్ స్టార్ గా సొంతం చేసుకున్నారని సీఎం గుర్తు చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,  మంత్రి కేటీఆర్ కృష్ణ భౌతిక కాయానికి నానక్ రామ్ గూడలోని నివాసంలో నివాళులు అర్పించారు. 

బుధవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు 

కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నానక్‌రామ్ గూడలోని కృష్ణ ఇంటికి భౌతిక కాయాన్ని తరలించారు. మంగళవారం సాయంత్రం వరకూ సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచుతారు. తర్వాత  గచ్చిబౌలి స్టేడియానికి తరలిస్తారు.  బుధవారం  మధ్యాహ్నం 2 గంటల వరకు  అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు.  అనంతరం అక్కడి నుంచి రేపు ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు తరలిస్తారు. కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక.. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలిపారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Embed widget