News
News
X

Mlc Kavitha : దిల్లీకి ఎమ్మెల్సీ కవిత, రేపు ఈడీ విచారణకు హాజరవుతారా?

Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి బయలుదేరారు.

FOLLOW US: 
Share:

Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిల్లీకి పయనం అయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్ లో దిల్లీ బయలుదేరి వెళ్లారు.  ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. దిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 20న విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే ఈ కేసు విచారణపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారా? లేక తన తరఫున న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఈ నెల 16న ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుకాలేదు.  

గత విచారణకు గైర్హాజరు 

దిల్లీ లిక్కర్ స్కామ్ లో  ఎమ్మెల్సీ కవితను ఈడీ ఈ నెల 11న విచారించింది. అయితే ఈ నెల 16న  మరోసారి విచారణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆరోగ్య కారణాల దృష్ట్యా 16న విచారణకు కవిత గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఆమె తన లాయర్ తో ఈడీకి లేఖ పంపారు. అయితే దీనిపై స్పందించి ఈడీ ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు నోటీసులు జారీ చేసింది. ఈడీ విచారణను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసి కవిత... 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే కవిత పిటిషన్‌ను ముందుగా విచారణ చేయలేమని 24వ తేదీనే విచారిస్తామని  సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ కవిత లేఖ రాశారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో  ఎక్కడా పేర్కొనలేదన్నారు. దర్యాప్తు చట్టప్రకారం జరగడంలేదనే అనుమానం కలుగుతుందని కవిత విమర్శించారు. సుప్రీంకోర్టులో ఈ నెల 24న తన పిటిషన్ విచారణ చేసే వరకూ ఆగాలని ఈడీని కోరారు. అయితే అందుకు ఈడీ ఒప్పుకోలేదు. ఈ నెల 20న విచారణకు హాజరుకావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ తరుణంలో కవిత ఈ నెల 20న ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? సందిగ్ధం నెలకొంది.  

సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ 

దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇటీవల విచారించింది. అయితే ఈ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ కు కౌంటర్ గా ఈడీ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని అభ్యర్థించింది. తమ వాదన విన్న తర్వాతే ఏ నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఈ పిటిషన్ పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసింది. అయితే కవిత పిటిషన్ పై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీతో పాటు కవిత తరపు వాదనలు కోర్టు విననుంది. ఈడీ తనను విచారణకు పిలవడాన్ని కవిత సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ 24న విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

Published at : 19 Mar 2023 07:06 PM (IST) Tags: Hyderabad MLC Kavitha Delhi Tour ED Enquiry BRS Delhi Liquor Scam

సంబంధిత కథనాలు

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌తో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు

Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌తో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు

Super Speciaity Hospital: దేశంలో తొలిసారిగా 24 అంతస్తుల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మన దగ్గరే!

Super Speciaity Hospital: దేశంలో తొలిసారిగా 24 అంతస్తుల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మన దగ్గరే!

Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Dharmapuri Sanjay On DS :  డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

Nizamabad కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!

టాప్ స్టోరీస్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!