By: ABP Desam | Updated at : 07 Mar 2022 08:51 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
బండి సంజయ్(ఫైల్ ఫొటో)
BJP MLAs Suspension: ఆర్ఆర్ఆర్ (రాజేందర్, రఘునందన్, రాజాసింగ్)ట్రైలర్ చూసే సీఎం కేసీఆర్ కు వణుకు పుడుతోందని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ఇక సినిమా రిలీజ్ అయితే ఆయన గుండె ఆగిపోతదేమో అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్దంగా సభను కొనసాగించాలన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరడమే బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన తప్పా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని దూషించి, బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనే లక్ష్యంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ ఆరోపించారు. బడ్జెట్‌పై బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్ ప్రశ్నించకూడదనే సస్పెండ్ చేశారన్నారు.
సమావేశాలు ఫాం హౌస్ లో నిర్వహించాల్సింది
🔸‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ చూసే సీఎం కేసీఆర్ కు వణుకు పుడుతోంది. సినిమా రిలీజ్ అయితే ఆయన గుండె ఆగిపోతదేమో..
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 7, 2022
🔸ప్రజాస్వామ్యబద్దంగా సభను కొనసాగించాలి.... అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరడమే బిజెపి ఎమ్మెల్యేలు చేసిన తప్పా?@TigerRajaSingh @Eatala_Rajender @RaghunandanraoM pic.twitter.com/ytwOmXWqth
ప్రతిపక్షాలు లేకుండా ప్రగతిభవన్‌లో, ఫాం హౌస్‌లో సమావేశాలు నిర్వహించుకోవాలని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీజేపీ ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌కే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. ఎన్ని రోజులు సమావేశాలు జరుగుతాయో కూడా తెలియకుండానే బీజేపీ ఎమ్మెల్యేలను ఎలా సస్పెండ్ చేస్తారని బండి సంజయ్ నిలదీశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అవుతుందని బండి సంజయ్ అన్నారు. దొడ్డి దారిన ప్రతిపక్షాలను దెబ్బతీయాలని సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు గుర్తులేదా?
పార్లమెంట్ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు చేసిన ఆందోళనను బండి సంజయ్ గుర్తు చేశారు. శాసనసభలో కూర్చునే అర్హత సీఎం కేసీఆర్‌కు లేదని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలపై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపటి నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు.
ఎమ్మెల్యేల సస్పెషన్ పై గవర్నర్ కు ఫిర్యాదు
బీజేపీ నేతలు గవర్నర్ తమిళి సై ను కలిశారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెషన్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఓ లేఖను గవర్నర్ కు అందించారు. బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రారంభించిన ప్రభుత్వం అనవాయితీలు పాటించలేదని లేఖలో బీజేపీ నేతలు ఆరోపించారు. పక్కా ప్రణాళికతో ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.
TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే
Rajanna Sircilla: కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !
TS SSC Exams: నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు, ఆ నిబంధన కచ్చితంగా పాటించాల్సిందే
Petrol-Diesel Price, 23 May: శుభవార్త! నేడూ తగ్గిన ఇంధన ధరలు, ఈ ఒక్క నగరంలోనే పెరుగుదల
Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
Horoscope Today 23 May 2022: ఈ రాశివారు ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించకపోవడమే మంచిది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SRH Vs PBKS Highlights: ఐపీఎల్‌ను ఓటమితో ముగించిన రైజర్స్ - ఐదు వికెట్లతో పంజాబ్ విజయం!