Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు - ఐఎండీ వార్నింగ్
రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేశారు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. రాగల 5 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుండి 50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు.
రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వానలు
రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 24, 2023
ఎల్లుండి (జూలై 25) భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40-50 కి.మీ.తో వీచే అవకాశం ఉందని తెలిపారు.
ప్రస్తుత వాతావరణ స్థితి
హైదరాబాద్ లోని వాతావరణ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. నిన్న దక్షిణ ఒడిశా - పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం ఈరోజు బలహీన పడింది. ఈ రోజు కూడా షీయర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ నుండి 5.8 కిమీ ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది. నిన్నటి ఆవర్తనం ఈ రోజు దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ పరిసరాలలోని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వద్ద కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
ఈ ఆవర్తన ప్రభావంతో, రాగల 24 గంటలలో ఒక అల్పపీడన ప్రదేశం, దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం & పరిసరాలలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీనం సుమారు జూలై 26న వాయుగుండంగా బలపడే అవకాశం కూడా ఉంది. ఈ వాయుగుండం నెమ్మదిగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్రప్రదేశ్ - దక్షిణ ఒరిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) July 24, 2023
#Hyderabad #WxAlert
— Weather@Hyderabad 🇮🇳 (@Rajani_Weather) July 24, 2023
Moderate/Heavy rain possible in the city during next 1 hour. Can start in half an hour.
Img Src: IMD Hyd radar pic.twitter.com/QdArEo6fgF