అన్వేషించండి

జూన్ 18 నుంచి 20 వరకు తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో వర్షాల సమయంలో మున్సిపల్, పోలీస్ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వానొస్తే రోడ్లపైనే ఉండాలని, ట్రాఫిక్‌జామ్‌లకు కారణమైతే చర్యలు తప్పవన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాష్ట్రంలో జూన్ 18-20 తేదీల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు.
  • మున్సిపల్ అధికారుల సమన్వయం లేకపోవడంపై సీఎం రేవంత్ ఆగ్రహం.
  • వర్షాల వేళ క్షేత్రస్థాయిలో ఉండాలని, నిర్లక్ష్యంపై కఠిన చర్యలు.
  • నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ సరఫరాపై అప్రమత్తతకు సీఎం ఆదేశం.

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారుతోంది. మూడు రోజుల తరువాత రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సోమవారం నుంచి మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. 

ప్రస్తుతం తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు కాస్త నెమ్మదిగా కదులుతున్నాయి. ఇవి రాబోయే నాలుగైదు రోజుల్లో మరింత బలపడి, రాష్ట్రమంతటా పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రుతుపవనాల విస్తరణతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ఎండల తీవ్రత నుంచి ప్రజలకు పూర్తిగా ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. 

రెండు రోజులు బలమైన ఈదురుగాలులు
నైరుతి రుతుపవనాల కదలికలతో సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సమయాల్లో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిల్చోవద్దని అధికారులు హెచ్చరించారు.

వర్షాల సమయంలో అధికారుల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ముందస్తు చర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని హైదరాబాద్‌లో ఇటీవలి వర్షాల సమయంలో మున్సిపల్, పోలీసు సిబ్బంది మధ్య కనీస సమన్వయం కొరవడటంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జూన్ 1న నిర్వహించిన సమీక్షలోనే వర్షాలపై ముందస్తు సూచనలు చేసినప్పటికీ, జూన్ 9న నగరంలో వాన కురిసన సమయంలో అధికారులు క్షేత్రస్థాయిలో సరిగా స్పందించలేదని మండిపడ్డారు. వర్షం వస్తే ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ రోడ్లపైనే ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని, అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు.


జూన్ 18 నుంచి 20 వరకు తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి

వర్షాల సమయంలో ప్లాన్ ప్రకారం వర్క్
నగరంలో నీరు నిలిచే ప్రాంతాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే బ్లాక్‌స్పాట్ల డేటా ఆధారంగా మున్సిపల్, ట్రాఫిక్ విభాగాలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడితే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్‌ నియంత్రణను మరింత బలోపేతం చేసేందుకు ఆ విభాగంలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. అలాగే, వర్షాకాలంలో అంతరాయం లేని సరఫరా కోసం విద్యుత్‌శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించి ఫీల్డ్‌లో అందుబాటులో ఉండని అధికారులపై వేటు తప్పదని తేల్చి చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా నిబంధనల ప్రకారం జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో చీఫ్ ఇంజనీర్లు, సూపర్ ఇంటిండెంట్ ఇంజనీర్లు ఎవరూ ప్రధాన కార్యాలయాల్లో కాకుండా తమకు కేటాయించిన స్థానిక ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల సురక్షిత నిర్వహణ, గేట్ల మరమ్మతులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. వర్షాకాలం ముగిసే వరకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉంటూ ఆస్తి నష్టాన్ని నివారించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

Frequently Asked Questions

తెలంగాణలో భారీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయి?

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, జూన్ 18 నుండి 20 తేదీల మధ్య రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. సోమవారం నుంచి మూడు, నాలుగు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయి.

నైరుతి రుతుపవనాల వల్ల వాతావరణం ఎలా మారుతుంది?

తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాబోయే నాలుగైదు రోజుల్లో బలపడి రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. దీంతో వర్షాల తీవ్రత పెరిగి, ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది.

ఈదురుగాలులు, పిడుగుల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సోమవారం, మంగళవారం బలమైన ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిల్చోవద్దు.

వర్షాల సమయంలో అధికారుల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి స్పందన ఏమిటి?

వర్షాల సమయంలో అధికారుల సమన్వయం కొరవడటంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget