అన్వేషించండి

Harish Rao: రేవంత్ రెడ్డికి ఐదేండ్లే ఎక్కువ‌, కాంగ్రెస్ ఎక్కడా ఎక్కువ కాలం అధికారంలో లేదు: హ‌రీశ్‌రావు

Harish Rao Fires On CM Revanth:అదృష్టం కొద్దీ గెలిచిన రేవంత్ ఐదేళ్లు మాత్రమే పదవిలో ఉంటారని హరీశ్ రావు అన్నారు. ఈ అయిదేళ్ల కాలమే మీకు ఎక్కువ అన్నారు. మీ పరిపాలనలో ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారన్నారు.

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరకొర రుణమాఫీ ఘనత తన పుణ్యమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రుణమాఫీ అయిందో లేదో సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి చౌరస్తాలో చర్చకు సిద్ధమేనా అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. రైతు రుణమాఫీ జరిగితే సురేందర్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశ్నించారు.  సిద్దిపేట వెంకటాపురం గ్రామంలో 82మంది రైతులకు రుణమాఫీ కాలేదని వివరాలు పంపిస్తానని వాళ్లకు రుణ మాఫీ చేయాలన్నారు.  ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న రేవంత్​రెడ్డి హుందాగా మాట్లాడాలని హరీశ్​రావు హితవు పలికారు. ఇవాళ గాంధీ భవన్​లో సీఎం రేవంత్  చేసిన వ్యాఖ్యలపై హరీశ్​రావు ఘాటుగా స్పందించారు. వానాకాలం రైతుభరోసా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. అంతే కాకుండా  అన్ని పంటలకు బోనస్‌ అని చెప్పి అంతా బోగస్‌ చేసిందెవరని నిలదీశారు.

లక్ కొద్దీ గెలిచారు
అదృష్టం కొద్దీ గెలిచిన రేవంత్ రెడ్డి ఐదేళ్లు మాత్రమే పదవిలో ఉంటారని హరీశ్ రావు అన్నారు. ఈ అయిదేళ్ల కాలమే మీకు ఎక్కువ అన్నారు. మీ పరిపాలనలో ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు. మీ లక్​ బాగుండి మీరు గెలిచారు, ఇప్పుడు ఐదేళ్లు మీరు సీఎంగా ఉంటారు. ఈ వ్యవధిలో మంచిగా పనులు చేయాలని సూచించారు. మీకున్న అవకాశాలను జాగ్రత్తగా వినియోగిస్తే కాస్తయినా మంచిపేరు వస్తుంది. రెండోసారి గెలిస్తా అంటే కాంగ్రెస్​కు అంత సీనులేదు. దేశంలో ఎక్కడైనా మీ పార్టీ ఒక్కసారికే  పోతుందని జోస్యం చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో ఐదేళ్లకే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దింపేశారని గుర్తు చేశారు.  ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామని మోసం చేసింది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు.

రుణమాఫీ పేరిట దగా 
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో సీఎం ఒకరకంగా.. వ్యవసాయశాఖ మంత్రి మరో రకంగా చెబుతున్నారన్నారు. ఫార్మాసిటీ కోసం కేసీఆర్‌ ప్రభుత్వం 12వేల ఎకరాలు సేకరించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఫోర్త్‌ సిటీ పేరిట డ్రామాలు ఆడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు.  


సీఎం కుర్చీ గౌరవం కాపాడండి
 నీ దిగ‌జారుడు మాట‌ల‌తో నీ గౌర‌వం పోతే బాధ‌లేదు.. కానీ సీఎం కుర్చీ గౌర‌వం కాపాడు అని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు చుర‌క‌లంటించారు. నీకు ఐదేండ్లే ఎక్కువ‌.. రెండోసారి అధికారంలోకి వ‌చ్చే సీన్ లేదు అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు ఉచిత క‌రెంట్ ఇచ్చిండంట‌. ఈ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు తెలియ‌దా.. ఉచిత క‌రెంట్ కాస్త ఉత్త క‌రెంట్ అయింది. అది దొంగ రాత్రి 7 గంట‌ల‌ని చెప్పి నాలుగైదు గంట‌లు కూడా క‌రెంట్ ఇవ్వ‌లేదు.. నాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌పార్మ‌ర్లు.. నిజమైన ఉచిత క‌రెంట్ ఇచ్చింది కేసీఆర్.. నాణ్య‌మైన‌ క‌రెంట్ ఇచ్చిండు. నాడు వైఎస్ ఇచ్చింది ఉత్త క‌రెంట్ అని ఏ రైతును అడిగానా చెబుతారు. అన్ని ప‌గ‌టి క‌ల‌లే ఈయ‌న‌వి. ప‌దేండ్లు మాది గ‌వ‌ర్న‌మెంట్ అని రేవంత్ రెడ్డి ప‌దేప‌దే చెబుతుండు. కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు.. రాజ‌స్థాన్‌లో, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఐదేండ్ల కంటే ఎక్కువ లేదు కాంగ్రెస్ ప్ర‌భుత్వం. నీవు ఐదేండ్లు ఉంటేనే ఎక్కువ‌. ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారు. కాక‌పోతే అదృష్టం బాగుడి గెలిచావు. తిట్ల దండ‌కాలు బంద్ చేసి.. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయ్.. ఐదేండ్లు మంచిగా ప‌ని చేయ్.. నీకు ఉన్న అవ‌కాశాల‌ను వినియోగించు మంచి పేరు వ‌స్త‌ది. రెండోసారికి సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక్క‌సారికే పోత‌ది అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.


ఉచిత కరెంట్ కాస్త ఉత్త కరెంట్ అయింది
ఇంకా హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘నీ దిగజారుడు మాటలతో నీ గౌరవం పోతే బాధ లేదు.. కానీ సీఎం కుర్చీ గౌరవం కాపాడు. నీకు ఐదేళ్లే ఎక్కువ.. రెండో సారి అధికారంలోకి వచ్చే సీన్ లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చిండంట. ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా.. ఉచిత కరెంట్ కాస్త ఉత్త కరెంట్ అయింది. అది దొంగ రాత్రి 7 గంట‌ల‌ని చెప్పి నాలుగైదు గంట‌లు కూడా క‌రెంట్ ఇవ్వ‌లేదు.. నాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌పార్మ‌ర్లు.. నిజమైన ఉచిత క‌రెంట్ ఇచ్చింది కేసీఆర్.. నాణ్య‌మైన‌ క‌రెంట్ ఇచ్చిండు. నాడు వైఎస్ ఇచ్చింది ఉత్త క‌రెంట్ అని ఏ రైతును అడిగానా చెబుతారు. అన్ని ప‌గ‌టి క‌ల‌లే ఈయ‌న‌వి.’’ అని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget