అన్వేషించండి

Harish Rao meets KCR: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో హరీష్ రావు సమావేశం - కవిత ఆరోపణలపై చర్చ - ఎమ్మెల్సీ పోచంపల్లికీ పిలుపు !

BRS Updates: ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో హరీష్ రావు సమావేశం అయ్యారు. కవిత కీలక ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి కూడా హాజరయ్యారు.

Harish Rao met with KCR at the farmhouse: భారత రాష్ట్ర సమితి  అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో శనివారం ఉదయం పార్టీ కీలక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కేటీఆర్), మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంబిపూర్ రాజు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాలు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.  

ఎమ్మెల్సీ పోచంపల్లిని కూడా పిలిపించడంతో కవిత ఆరోపణలపైనే చర్చిస్తున్నట్లు సమాచారం                   
 
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ ఉదయం నుంచి ఉండగా, లక్ష్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంబిపూర్ రాజు వరుసగా కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు కాస్త ఆలస్యంగా ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. తెల్లవారుజామునే ఆయన లండన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. కవిత చేసిన ఆరోపణలపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. సంతోష్ రావుతో కలిసి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని మోకిలా వద్ద రూ.750కోట్ల విల్లా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో పోచంపల్లిని కూడా ఫామ్ హౌస్ కు పిలిపించడం ఆసక్తికరంగా మారింది.                

కాళేశ్వరం పై సీబీఐ విచారణపైనా తదుపరి వ్యూహం ఖరారు                          
 
అదే సమయంలో కాళేశ్వరం అంశంపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ రిపోర్టు పై సీబీఐ విచారణ జరగనుంది. సీబీఐ డైరక్టర్ స్వయంగా హైదరాబాద్ రావడంతో సీరియస్ గా విచారణ జరుగుతుందని అనుకుంటున్నారు.  ఇది పూర్తిగా  కాళేశ్వరం పై జరుగుతున్న కుట్రగా  రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నాయకులకు సూచిస్తున్నారు.  బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సమావేశాలు నిర్వహించి, పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.                

కవిత పార్టీ పెడితే ఎలా ఎదుర్కోవాలన్న  అంశంపైనా చర్చలు                         

కవిత సొంత పార్టీ పెట్టే అవకాశాలపై కూడా చర్చించారు. కవిత పార్టీ పెడితే అనుసరించాల్సిన వ్యూహాంపైనా ఓ అభిప్రాయానికి  వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కోంటోంది. కానీ బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలతో సమస్యలను  ఎదుర్కోటోంది. వీటికి ఎక్కువ ప్రాధాన్యత రాకుండా ఉండాలంటే.. కవితను తక్కువగా టార్గెట్ చేసుకుని.. ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శించాలన్న అభిప్రాయం వినిపించింది. ఈ సమావేశం సుదీర్ఘంగా సాగే అవకాశాలు ఉన్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Yadadri Child Rescue: అయ్యో బిడ్డా.. వారం రోజులుగా అడవిలో బాతులతో పాటే నిద్ర.. ఆరేళ్ల బాలికను కాపాడిన గ్రామస్తులు!
అయ్యో బిడ్డా.. వారం రోజులుగా అడవిలో బాతులతో పాటే నిద్ర.. ఆరేళ్ల బాలికను కాపాడిన గ్రామస్తులు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget