Harish Comments : ప్రధాని మోదీని సీఎం జగన్ కలిసేది అందుకోసమేనా ? - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీని ఏపీ సీఎం జగన్ కలిసేది సీబీఐ కేసుల గురించేనని హరీష్ రావు వ్యాఖ్యనించారు. సిద్దిపేటలో పలు కార్యక్రమాల్లో హరీష్ రావు పాల్గొన్నారు.

Harish Comments : తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చినప్పుడు తనతో ఎన్డీఏలో చేరేందుకు ఆసక్తి చూపించారన, కేటీఆర్‌ను సీఎం ను చేసేందుకు సహకరించాలని కోరారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు పరోక్షంగా స్పందించారు. కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా ప్రాజెక్టుల గురించి ..నిధుల గురించి అడుగుతారని.. అదే ఏపీ సీఎం జగన్ వస్తే.. సీబీఐ కేసుల గురించే మాట్లాడతారని పార్లమెంట్‌లోనే చెప్పారన్నారు. హరీష్ రావు మాటలు వైరల్ అవుతున్నాయి.
PM Modi was telling in the Parliament, that TG CM KCR doing good job, when meets me, asks about water, projects, development, While AP CM (#YSJagan) when meets me asking about cases (CBI, ED) only : HarishRao.#HelloAP_ByeByeYCP pic.twitter.com/Cgbsh75N8X
— SENANI Followers (@SenaniFollowers) October 5, 2023
సిద్దిపేటలో మెడికల్ కాలేజకి అనుబంధంగా ఆస్పత్రి ప్రారంభం
సిద్దిపేటలో సిద్దిపేటలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనంగా నిర్మించిన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. 175 సీట్లు సిద్దిపేట మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు పొందుతారని, ఇందులో 25% అంటే 25 సీట్లు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చదువుతారని, ఢిల్లీ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఏంటో అర్థం అవుతుందని ప్రశంసించారు. గతంలో సిద్దిపేట మెడికల్ కాలేజ్ నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పంపించేవారు కానీ ఇకపై నుండి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయని, నూతన క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇకనుండి క్యాన్సర్ చికిత్స కూడా ఇక్కడే అందించబడుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.
అత్యాధునిక వైద్య సౌకర్యాలు
ఈ ఆస్పత్రిలో 40 పడకల డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశామని, 15 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందులో 8 మార్జిలర్ ఆపరేషన్ థియేటర్లు నిర్మించుకున్నామని, 100 ఐసియు బెడ్ లు పూర్తి సామర్ధ్యంతో సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రైవేట్ కి దీటుగా వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు. 30 పడకలతో ఎమర్జెన్సీ వార్డు ఉంటుందని, 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాకు ఏర్పాటు చేయబోతున్నామని, 875 మంది వైద్య విద్యార్థులు ఉంటారని హరీష్ రావు వివరించారు. 13 డిపార్ట్ మెంట్లలో పిజి కోర్సులు అందుబాటులో ఉన్నాయని, మరో 3 నూతన పిజి సీట్లు ఏర్పాటు చేశామని, ప్రతి ఏడాది 62 మంది పిజి విద్యార్థులకు కూడా చదివే అవకాశం ఉందన్నారు.
అందరికీ వైద్య విద్య
సంపన్నుల పిల్లలే డాక్టర్ చదువు చదవాలన్న నానుడిని మారుస్తూ రైతులు, కూలీల పిల్లలు కూడా ఎంబిబిఎస్ చేసే అవకాశం ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చారని కొనియాడారు. స్టాఫ్ నర్స్ ల పేరు మారుస్తూ నర్సింగ్ డాక్టర్ గా పిలుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సింగ్, బి ఫార్మసీ కాలేజ్ లు సిద్దిపేట లో ఉన్నాయని, 280 మంది డాక్టర్లు 24 గంటలు వైద్య సేవలు అందిస్తారని, వీరితోపాటు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్న 150 మంది డాక్టర్లు కూడా సేవలు అందిస్తారని ప్రశంసించారు. ప్రాథమిక చికిత్స నుండి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందించబడతాయని, ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం..కానీ ఇప్పుడు కరువు కూడా తెలియడం లేదని హరీష్ రావు చెప్పారు.





















