తెలంగాణ విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవు- బడి తెరుచుకునేది సోమవారమే !
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల కారణంగా అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలనిముఖ్యమంత్రి ఆదేశించారు.
తెలంగాణలో మరో రెండురోజుల పాటు వర్షాలు బీభత్సం సృష్టించనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై ముందుగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే వర్షాల కారణంగా వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. ఇప్పుడు శుక్రవారం కూడా సెలవు ప్రకిటించడంతో వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చినట్టు అవుతుంది.
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దీంతో ఆయా జిల్లా యంత్రాంగానికి విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం సెలవులు ఇవ్వాలని అన్ని విద్యాసంస్థలకు సూచనలు చేశారు.
28వ తేదీన హాలీడే ప్రకటించడంతో తర్వాత రోజు 29వ తేదీన మొహర్రం పండుగ ఉంది. అందుకే ఆరోజు అధికారిక సెలవు ఉండనే ఉంది. 30వ తేదీన ఆదివారం రానే వచ్చింది. ఇలా వరుసగా ఐదు రోజులు సెలవులు ఇచ్చినట్టు అవుతుంది.
ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం 28వ తేదీన మొహర్రం పండగ, 29వ తేదీన మొహర్రం జనరల్ హాలీడే గాఉంది. అయితే 28న చాలా మంది ఆప్షనల్ హాలీడేగా ఇచ్చేస్తారని అనుకున్నారు. కానీ ప్రభుత్వమే సెలవు ప్రకటించింది. 29న సెలవు స్కూళ్లకు వర్తించనుంది. 30న ఎలాగూ ఆదివారం కాబట్టి వరుసగా మొత్తం ఐదు రోజులు సెలవులు వచ్చాయి.