By: ABP Desam | Updated at : 05 Jan 2023 05:52 PM (IST)
కేసీఆర్ రిలీజ్ చేయడం కంటే ముందే సాక్ష్యాలు మీడియాలో వచ్చాయన్న ప్రభుత్వ లాయర్
Farmhouse Case : ఫాం హౌస్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన సవాల్ పిటిషన్ పై విచారణ జరిగింది. సీజే నేతృత్వంలోని ధర్మాసనం దానిపై విచారణ జరిపింది. తన క్లయింట్ కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే కింది కోర్టు తీర్పు ఇచ్చిందని రోహిత్ రెడ్డి తరఫు లాయర్ ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా.. దాన్ని రద్దు చేసి సీబీఐకు అప్పగించడం సరికాదని అన్నారు. అంతకు ముందు ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యంతరాలను న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించిన తర్వాతే అవి సీఎం కేసీఆర్ చేతికి వెళ్లాయని కోర్టుకు విన్నవించారు.
సీఎం కేసీఆర్ సాక్ష్యాలు ప్రెస్ మీట్‌లో బయట పెట్టక ముందే మీడియాలో వచ్చాయన్న ప్రభుత్వ లాయర్
పైలెట్ రోహిత్ రెడ్డి సాక్ష్యాలు, ఆధారాలను సీఎం కేసీఆర్ కు ఇచ్చి ఉంటారని కోర్టుకు చెప్పారని, అయితే అలా జరగలేదని దవే న్యాయమూర్తికి వివరించారు. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కోర్టుకు సరైన సమాచారం అందించలేకపోయారని చెప్పారు. సీఎం ప్రెస్ మీట్ కు ముందే ఆ వీడియోలు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కేవలం ముఖ్యమంత్రి మీడియా సమావేశాన్ని సాకుగా చూపి కేసులో సీబీఐకు అప్పగించడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుంటే పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందని చెప్పారు.
అప్పీల్ పిటిషన్ మెయిన్‌టనబుల్ కాదన్న నిందితుల తరపున న్యాయవాది
ప్రతిపాదిత నిందితుల తరఫున వాదనలు వినిపించిన సీతారామ్మూర్తి రిట్ అప్పీల్ పిటిషన్ అసలు మెయింటేనబుల్ కాదని కోర్టుకు తెలిపారు. క్రిమినల్ రివిజన్ పిటిషన్పై రిట్ అప్పీల్కు అవకాశంలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. రివిజన్ పిటిషన్ పై సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇరువర్గాల వాదనలు ఇంకా కొనసాగాల్సి ఉన్నందున శుక్రవానికి హైకోర్టు వాయిదా వేసింది.
అసలు కేసేమిటంటే ?
భారత్ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) నలుగురు ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం, బిజెపికి అనుకూలంగా మారేందుకు వారిని ఆకర్షించడం వంటి పనులకు ఆ ముగ్గురు నిందితులు పాల్పడ్డారన్నది ఆరోపణ. రామచంద్ర భారతి, సింహయాజీ, నంద కుమార్ అనే ఆ ముగ్గురు నిందితులు మోయినాబాద్ ఫారమ్ హౌస్‌లో ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టే, బిజెపి పార్టీలోకి ఆకర్షించే మంతనాలు జరిపారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు రూ. 100 కోట్లు, మిగతా ముగ్గురు ఎంఎల్‌ఏలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఇచ్చేలా వారు ప్రలోభపెట్టారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఆ ముగ్గురు బిజెపి ఏజెంట్లని ఆరోపణ.తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక పరిశోధన బృందం(సిట్)ను నవంబర్ 9న ఏర్పాటు చేసింది. తర్వాత పరిణామాలతో హైకోర్టు సింగిల్ బెంచ్.. కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Telangana budget 2023 : ఎన్నికల ఏడాదిలో కలర్ ఫుల్ బడ్జెట్ - బడ్జెట్లో కొత్త పథకాలు పెట్టనున్న తెలంగాణ సర్కార్ !
Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్కు ఇదే పెద్ద టాస్క్
Telangana budget 2023 : కొత్త పన్నులు - భూముల అమ్మకం ! తెలంగాణ బడ్జెట్లో ఆదాయ పెంపు మార్గాలు ఇవేనా ?
Union Budget 2023-24: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా- హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు!
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?
Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!