అన్వేషించండి

Kishan Reddy: గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు, జాతీయ పండుగగా మేడారం జాతర : బీజేపీ

Kishan Reddy: భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లు అమలుచేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Kishan Reddy: భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణలో అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లు అమలుచేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (G Kishan Reddy) అన్నారు. బుధవారం ఆయన ములుగు జిల్లాలో పర్యటించారు. గిరిజన ఆరాధ్య దైవం గట్టమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఎంపిక చేసిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. తరువాత మేడారంలోని సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. మోదీ నేతృత్వంలో భారత్ దేశం మరింత అభివృద్ధి పథంలో సాగాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచంలో భారత్‌ను విశ్వ గురువుగా నిలబెట్టేలా  ప్రధాని మోదీకి అమ్మవార్లు శక్తిని ఇవ్వాలని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు. 

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కేంద్ర గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికలలో విద్యా ఉపాధి పథకాల్లో గిరిజనులకు 10 % రిజర్వేషన్ కల్పిస్తామని హమీ ఇచ్చారు. ములుగు జిల్లాలో టూరిజం అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోదీ నాయకత్వంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. లక్నవరం, బొగత జలపాతం, రామప్ప, మల్లూరు పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. గిరిజన ప్రాంతాలలో 17  ఏకలవ్య పాఠశాలలో ఏర్పాటు చేసి గిరిజన సాంప్రదాయాలను  కాపాడుతున్నామని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గిరిజనలను ఏనాడు పట్టించుకోలేదన్నారు.

ట్రైబల్ సర్క్యులర్ ఏర్పాటు చేస్తాం
వెనుకబడిన గిరిజన ప్రాంతాలైన భూపాలపల్లి, ఆసిఫాబాద్, అదిలాబాద్ ప్రాంతాలను కలిపి ట్రైబల్ సర్క్యులర్ పేరుతో కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. గిరిజన యూనివర్సిటీకి 900 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఘనంగా నిర్వహించుకున్నట్లు చెప్పారు. కొండ, కోనల్లో ఉన్న వేలాది మంది గిరిజన బిడ్డలకు యూనివర్సిటీ ద్వారా సువర్ణ అవకాశం లభించనుందని చెప్పారు. గిరిజనుల మీద ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే రాష్ట్రపతి ముర్ము నియామకం అన్నారు. ములుగు జిల్లాను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. 

జాతీయ పండుగగా మేడారం జాతర
అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అమ్మవార్లకు మొక్కలు చెల్లించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలని ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ధర్మం, న్యాయం నిలవాలని, ప్రజల ఆంకాంక్షలు నెరవేరాలని వేడుకున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని, మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి కోరతామన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి ముందుకు తీసుకువెళ్లే పార్టీ బీజేపీ అన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం నేతలు చాలా మాట్లాడుతుంటారని కానీ బీజేపీ ప్రజల ఆలోచనలు, సాంప్రదాయాలకు అణుగునంగా నడుచుకుంటుందని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget