Free Wifi in TSRTC Buses: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ - ఇకపై ఆ బస్సుల్లో ఫ్రీ వైఫై
Free Wifi in TSRTC Buses: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. తొలి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులను ఇప్పటికే రంగంలోకి దింపగా వీటిలో ఫ్రీ వైఫై కూడా కల్పించారు.
![Free Wifi in TSRTC Buses: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ - ఇకపై ఆ బస్సుల్లో ఫ్రీ వైఫై Free Wifi in TSRTC Buses TSRTC Launching 16 AC Sleeper Buses know complete details Free Wifi in TSRTC Buses: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ - ఇకపై ఆ బస్సుల్లో ఫ్రీ వైఫై](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/26/bd265c39c029540fc757f267a270c45c1679835835856519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Free Wifi in TSRTC Buses: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పండుగలు, జాతర లాంటి సీజన్లలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ఇప్పటికే పలు రకాల సేవలను ప్రారంభించింది. తాజాగా హైటెక్ బస్సులను కూడా రంగంలోకి దింపుతోంది. తొలి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులు ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్నాయి. ప్రైవేటు బస్సుల్లో ఉండే దాదాపు అన్ని ఫీచర్లు ఈ బస్సుల్లో అందుబాటులోకి తీసుకు వస్తున్నారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు, హుబ్లీ, విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలో ఈ బస్సులు నడవనున్నాయి. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కొత్త ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. లహరి పేరుతో తీసుకువచ్చిన ఈ ఏసీ స్లీపర్ బస్సులకు అత్యాధునిక సాంకేతికతను జోడించారు. ప్రయాణికుల భద్రతు పెద్ద పీట వేస్తూ.. ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయాన్ని కల్పించారు. వీటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు.
ప్రయాణికులకు అందుబాటులోకి 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు. రాష్ట్రంలో తొలిసారిగా వాడకంలోకి తెస్తోన్న టీఎస్ఆర్టీసీ. ఎల్బీనగర్ లో రేపు కొత్త ఏసీ స్లీపర్ బస్సుల ప్రారంభోత్సవం. @way2_news @TV9Telugu @10TvTeluguNews @abntelugutv @NTVJustIn @ntdailyonline @eenadulivenews @Telugu360 pic.twitter.com/wElzq82zdV
— PRO, TSRTC (@PROTSRTC) March 26, 2023
మొత్తం 12 మీటర్ల పొడువు ఉండే ఏసీ స్లీపర్ బస్సుల్లో.. 15 లోయర్ బెర్త్ లు, 15 అప్పర్ స్లీపర్ బెర్త్ లు ఉంటాయి. బెర్త్ ల వద్ద మొబైల్ ఛార్జింగ్, రీడింగ్ ల్యాంప్ సౌకర్యం ఉంటుంది. వీటితో పాటు బస్సుల్లో ఉచిత వైఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. సెక్యూరిటీ కెమెరాలతో పాటు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరాను కూడా అందించారు. వీటితో పాటు అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టంను ప్రత్యేకంగా అందించారు.
ప్రయాణికులకు శుభవార్త! 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు రేపటి నుండి అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా వీటిని #TSRTC వాడకంలోకి తెస్తోంది. LB Nagar లో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 26, 2023
బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభిస్తారు. #NewACSleeperBuses pic.twitter.com/WBrFy37xmt
డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చిన టీఎస్ఆర్టీసీ
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలు చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తోంది. విమానాలు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, హోటళ్లలో అమలు చేస్తున్న ఈ పద్దతిని దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో అది కూడా బస్సుల్లో అమల్లోకి తీసుకురాబోతుంది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈనెల 27వ తేదీ నుంచి అమలు చేయనుంది. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో ప్రయాణికుల రద్దీ ఉండే వారాంతాలు, పండుగ రోజుల్లో సాధారణ ఛార్జీలకు మించి టికెట్ ధర ఉంటుంది.
అలాగే సాధారణ రోజుల్లో తక్కువగా ఉంటుంది. డిమాండ్ ని బట్టి 125 శాతం నుంచి 70 శాతం వరకు ధరలు మారుతుంటాయి. అంతేకాకుండా ముందు సీట్లు, కిటికీ పక్కన సీట్లకు ఎక్కువ ధర ఉంటుంది. ఈ పద్ధతిలో కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలు ప్రైవేటు ఆపరేటర్ల రేట్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీల ఛార్జీలను విశ్లేషించి టికెట్ ధరలు నిర్ణయిస్తామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ వెల్లడించారు. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లో డైనమిక్ ప్రైసింగ్ ద్వారా ప్రైవేట్ ఆపరేటర్ల పోటీ తట్టుకొని ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ కసరత్తులు చేస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)