అన్వేషించండి

Malkajigiri Congress Ticket : మల్కాజిగిరి కాంగ్రెస్ టిక్కెట్ కోసం క్యూ - రేసులోకి మర్రి జనార్ధన్ రెడ్డి కూడా !

Telangana News : మల్కాజిగిరి కాంగ్రెస్ టిక్కెట్ కోసం నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ టిక్కెట్ కోసం చాలా పెద్ద క్యూ ఉంది.

Telangana Loksabha Elections :  మల్కాజిగిరి లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని కాంగ్రెస్‌ నాయకులు, పార్టీ శ్రేణులకు టికెట్‌ టెన్షన్‌ పట్టుకుంది.   సీఎం రేవంత్‌రెడ్డి సిట్టింగ్‌ స్థానం కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుచుకోవాలన్న లక్ష్యంతో బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దించేందుకు  ప్రయత్నిస్తున్నారు. పార్టీలో బలమైన నేతలు లేకపోవడంతో.. ఫిరాయింపు నేతలతోనే ప్రయత్నించనున్నారు.  ఇప్పటికే బీఆర్‌ఎస్‌, బీజేపీ తమ అభ్యర్థులుగా రాగిడి లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్‌ను ప్రకటించా యి. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్‌ చేస్తున్న కసరత్తులో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది.

బలమైన అభ్యర్థి కోసం రేవంత్ వెదుకులాట                        

మేడ్చల్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే మల్కాజిగిరి పార్ల మెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి విషయంలో అంతా టెన్షన్‌ వాతావరణం నెలకొంది.ప్రత్యర్థులకు దీటైన అభ్యర్థిని రంగంలోకి దించాలని పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం ఆలోచిస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకుంటోంది. సామాజిక సమీక రణాలు, అంగ, అర్థబలం ఆధారంగా బలమైన నాయకులను బరిలో దించేందుకు కసరత్తు చేస్తోంది. 

తెరపైకి కొత్త పేర్లు           

మల్కాజిగిరి అభ్యర్థి విషయంలో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. మొదట బండ్ల గణేష్ పేరు కూడా వినిపించింది. తర్వాత   సినీనటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించినా, రెండు, మూడు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే కొత్త వారు బరిలో ఉండేలా కనిపిస్తోంది. నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు పోటీలో ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. చేవేళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగిన సమయంలో బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను బరిలో నిలవడంతో రంజిత్‌రెడ్డి వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. 

మర్రి జనార్ధన్ రెడ్డి ప్రయత్నాలు           

నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారికంగా ఆయన కాంగ్రెస్ లో చేరలేదు. అయినా ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు. ఆయన నేరుగా కాంగ్రెస్ హైకమాండ్ తో టచ్ లో ఉన్నారు. నాలుగు, ఐదు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నా.. వికారాబాద్‌ జెడ్పీ చైర్మెన్‌ సునీతా మహేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిలో ఎవరికో ఒకరికి టికెట్టు దక్కేలా కనిపిస్తోంది.     చేవెళ్ల సీటు ఆశించి పార్టీలో చేరిన సునీతా మహేందర్‌రెడ్డికే మల్కాజిగిరి టికెట్‌ కేటాయిస్తారని చర్చ నడుస్తోంది. కొసమెరపేమిటంటే.. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన కుమారుడు భద్రారెడ్డి కోసం డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:చిత్తూరులో గంజాయి మత్తులో తండ్రిని చంపిన కుమారుడు- అడ్డు వచ్చిన మేనత్తకు గాయాలు!
చిత్తూరులో గంజాయి మత్తులో తండ్రిని చంపిన కుమారుడు- అడ్డు వచ్చిన మేనత్తకు గాయాలు!
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Embed widget