By: ABP Desam | Updated at : 28 Jul 2021 12:24 PM (IST)
Jeedimetla Fire Accident
ఈ తెల్లవారు జామున హైదరాబాద్‌లోని జీడిమెట్లలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు స్పాట్‌లోనే చనిపోయారు. నాసెన్స్ కెమికల్ ఇండస్ట్రీలో ప్రమాదం జరిగింది.
ఉదయం విధులు ప్రారంభమైన కొద్దిసేపటికే పరిశ్రమలోని ఓ రియాక్టర్ పేలింది. ఈ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటవెంటనే మరికొన్ని రియాక్టర్లు పేలాయి.
ప్రమాద సమయంలో భారీ శబ్ధాలతో రసాయన డ్రమ్ములు పేలాయి. పరిశ్రమలో మొత్తం పది రియాక్టర్లు ఉండగా... నాలుగు రియాక్టర్లు పేలాయి. అందుకే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.
యాక్సిడెంట్ టైంలో చాలా మంది కార్మికులు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. స్పాట్‌లోనే ఇద్దరు కార్మికులు చనిపోయినట్టు తెలుస్తోంది. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పరిశ్రమలో హరిప్రసాద్, అర్జున్, మనీష్ బస్కీ అనే ముగ్గురు సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు. మంటలు అంటుకొని ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
ఈ దుర్ఘటనలో విజయ్ అనే కార్మికుడు కనిపించకపోవడం కలకలం రేపింది. మంటలు ఆర్పిన తర్వాత ఆయన కోసం గాలిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆ ఏరియాలో పొగ కమ్మేసింది. స్థానికులు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఏదో జరిగిందని తెలుసుకొని ఫైర్ సేఫ్టీ డిపార్టమెంట్‌కు కాల్ చేసి చెప్పారు.
ఈ విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే.. ఘటన స్థలానికి వచ్చి.. మంటలార్పుతున్నారు. నాలుగు ఫైరింజన్లతోపాటు నీటి ట్యాంకర్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బాయిలర్ పేలడం కారణంగానే.. ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బీజేపీ అధినాయకత్వం నుంచి ఈటలకు పిలుపు, కీలక పదవి అప్పగించే ఛాన్స్ !
Fish Prasad: నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం- తరలివస్తున్న ఆస్తమా బాధితులు
చెరువుల పండుగలో అపశ్రుతి- నాటు పడవలో వెళ్తూ నీటిలో పడిపోయిన మంత్రి గంగుల
Top 10 Headlines Today: మెగాస్టార్ ఇంట గ్రాండ్ ఎంగేజ్‌మెంట్, సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ విచారణ, తెలంగాణలో బీసీలకు లక్ష
Top 10 Headlines Today: కేసీఆర్ వ్యూహం ఏంటీ? అవినాష్ అరెస్టు విడుదల!, రహానే-భరత్‌పైనే భారం, ఇవే మార్నింగ్ చూడాల్సిన వార్తలు
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?
MP Avinash Reddy Arrest In YS Viveka Case: ఈ నెల 3వ తేదీన అరెస్ట్ చేసిన సీబీఐ
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం